సీ్త్రనిధి నగదు గోల్‌మాల్‌పై ఫిర్యాదు
వరికుంటపాడు: సీ్త్రనిధి నగదు గోల్‌మాల్‌పై తోటలచెరువుపల్లికి చెందిన ఆరు స్వయం సహాయక సంఘాల సభ్యులు మండల వెలుగు కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం ఏపీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో ఆరు గ్రూపులు ఉన్నాయని తెలిపారు. సీ్త్రనిధి నుంచి ఒక్కో గ్రూపు రూ.2లక్షలు చొప్పున మొత్తం రూ.12 లక్షలు రుణంగా తీసుకున్నట్లుగా చెప్పారు. అందుకు సంబంధించి ఒక్కోగ్రూపు నెలకు రూ.9,600 చొప్పున 23 నెలలు చెల్లించాల్సి ఉండగా 25 నెలలు చెల్లించినట్లుగా తెలిపారు. అయినా ఇంకా ఆరు గ్రూపులకు సంబంధించి రూ.లక్షకుపైగా చెల్లించాలని వెలుగు సీసీ ఒత్తిడి చేస్తోందని, ఆ మొత్తం చెల్లించకపోతే కొత్త రుణాలు మంజూరు చేయబోమని చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగు తున్నా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. సీసీని డిప్యుటేషన్‌పై మర్రిపాడు మండలానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా వాటిని లెక్కచేయకుండా కొనసాగుతున్నారని ఆరోపించారు. సీ్త్రనిధి నిధుల గోల్‌మాలకు పాల్పడుతున్న సీసీలను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఏపీఎంను కోరారు.


