ట్రాన్స్‌కోకు నష్టం | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కోకు నష్టం

Jan 6 2026 7:13 AM | Updated on Jan 6 2026 7:13 AM

ట్రాన్స్‌కోకు నష్టం

ట్రాన్స్‌కోకు నష్టం

అధికారుల నిర్ణయం..

రూ.4 కోట్లు ఎక్కువ టెండర్‌ వేసిన

కాంట్రాక్టర్‌కు పనులు

సబ్‌స్టేషన్‌ నిర్మాణంతో వెలుగులోకి స్కామ్‌

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): అధికారుల తీసుకున్న నిర్ణయంతో ట్రాక్స్‌కోకు నష్టం వస్తోందని ఆరోపణలున్నాయి. ఏపీ ట్రాన్స్‌కో గతేడాదిలో నెల్లూరు నగరంలోని రాజేంద్రనగర్‌ ప్రాంతంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి చెందిన రెండెకరాల స్థలంలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు టెండర్లు పిలిచింంది. రూ.32 కోట్లకు వచ్చిన టెండర్‌ను ఖరారు చేశారు. అయితే కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితో కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ప్రచారముంది. అయితే ఖరారు చేసిన వ్యక్తికి కాకుండా అదనంగా రూ.36 కోట్లకు టెండర్‌ వేసిన కాంట్రాక్టర్‌కు నిర్మాణ పనులు అప్పజెప్పేలా నేతలు ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలున్నాయి. దీంతో ట్రాన్స్‌కోలో టెండర్‌స్కాం వెలుగులోకి వచ్చింది.

అదనపు భారం

సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి తక్కువ టెండర్‌ వేసిన కాంట్రాక్టర్‌ను కాదని రూ.4 కోట్లు అదనంగా వేసిన వ్యక్తికి పనులు కేటాయించడంతో ఏపీ ట్రాన్స్‌కోపై భారం పడనుంది. ఈ టెండర్‌ స్కామ్‌లో నాయకులు, అధికారుల పాత్ర ఏ మేర ఉందో తెలియాల్సి ఉంది. రాజేంద్రనగర్‌లో నిర్మించనున్న 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ స్థలం డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి చెందింది. నిర్మాణానికి ఆ స్థలం కేటాయించడంతో అందుకు బదులుగా ట్రాన్స్‌కోకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి ట్రాన్స్‌కో ఇవ్వాల్సి ఉంది. ట్రాన్స్‌కోకు నెల్లూరులోని అంబాపురం, కావలి, గూడూరు ప్రాంతాల్లో భూములున్నాయి. డీఎంహెచ్‌ఓ వారు ఏ ప్రాంతంలో కావాలంటే అక్కడ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఏది ఏమైనా ట్రాన్స్‌కో వారు అదనంగా రూ.4 కోట్లు టెండర్‌ దాఖలు చేసిన కాంట్రాక్టర్‌కు సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు అప్పజెప్పడం చర్చనీయాంశమైంది.

నిర్ణయాలు అక్కడే జరుగుతాయి

ట్రాన్స్‌కో వారు నిర్మిస్తున్న 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు సంబంధించిన నిర్ణయాలు విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో తీసుకుంటారు. అదనంగా నగదు కేటాయించే అధికారాలు మాకు లేవు. ట్రాన్స్‌కో ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సబ్‌స్టేషన్ల నిర్మాణ ప్రక్రియను, నాణ్యతా ప్రమాణాలను మాత్రమే పర్యవేక్షిస్తారు. టెండర్ల విషయంలో జిల్లా ట్రాన్స్‌కో అధికారులకు ఎలాంటి సంబంధం ఉండదు.

– రత్నం, ఏపీ ట్రాన్స్‌కో ఈఈ

(ఇన్‌చార్జి కన్‌స్ట్రక్షన్‌ విభాగం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement