కన్నీళ్లు దిగమింగి.. కష్టాలు పడుతూ..
పాలకులు, అధికారులు దృష్టి పెడితే ప్రజలకు కష్టాలు తప్పుతాయి. కానీ అలా జరగడం లేదు. కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలానికి చెందిన శ్రీదేవికి నాగ్ గోవర్ధన్ అనే కుమారుడున్నాడు. అతను దివ్యాంగుడు. మంచానికే పరిమితమయ్యాడు. పింఛన్‌ను రూ.15,000కు పెంచాలంటూ ఆ తల్లి ప్రజాప్రతినిధులు, యంత్రాంగం చుట్టూ తిరుగుతోంది. అయితే ఎవరూ కనికరించలేదు. దీంతో సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కుమారుడిని ఆటోలో తీసుకొచ్చింది. గోవర్ధన్‌ను కిందకు దించేందుకు అక్కడి సిబ్బంది సాయం తీసుకుని ఉన్నతాధికారులను వేడుకుంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
కన్నీళ్లు దిగమింగి.. కష్టాలు పడుతూ..


