దశాబ్దాల దుస్థితి.. ఐదేళ్ల ప్రగతి
రూ.72 కోట్లు మంజూరు
●
ట్రాఫిక్ కష్టాలు తొలగాయి
పడుగుపాడు– వెంకటేశ్వరపురం రహదారిని విస్తరించడంతో ట్రాఫిక్ కష్టాలు తొలగాయి. గతంలో నెల్లూరు నగరంలోకి సరుకు రవాణా వాహనాలు వెళ్లేందుకు అరగంటకుపైగా సమయం పట్టేది. ప్రస్తుతం రోడ్డు విస్తరణతో సమయం బాగా ఆదావుతోంది. గతంలో ట్రాఫిక్‌తో ఇంధన ఖర్చు ఎక్కువయ్యేది. ఇప్పుడు బాగా తగ్గింది.
–నెల్లూరు సుబ్బయ్య, వ్యాపారి,
పడుగుపాడు
పార్కింగ్ సమస్య తప్పింది
రోడ్డు విస్తరణకు ముందు దుకాణాల ఎదుట వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందిగా ఉండేది. దీంతో దుకాణాల వద్దకు కస్టమర్లు వచ్చేందుకు ఆసక్తి చూపేవారు కాదు. ప్రస్తుతం రోడ్డు విస్తరణతో పార్కింగ్ సమస్య తప్పింది. డ్రైనేజీ నిర్మాణంతో వర్షపు నీరు నిల్వక పోడంతో వ్యాపారానికి ఆటంకం కలగడం లేదు. –కడింపాటి శశిధర్
గత ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల సంస్థ 2023–24 ఆర్థిక సంవత్సరంలో పడుగుపాడు– వెంకటేశ్వరపురం రహదారి విస్తరణకు రూ.72 కోట్లను మంజూరు చేసింది. ఆరు లేన్లుగా రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి 118 మంది బాధితులకు రూ.1.80లక్షలు చొప్పున రూ.2,12,40,000 పరిహారాన్ని అందజేశారు.
కోవూరు : రాజకీయాల్లో మాటలు చెప్పేవారు కొందరైతే.. పనులు చేసి చూపించేవారు మరికొందరు. ఆ కోవకే చెందుతారు మాజీ మంత్రులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్. కోవూరు నియోజకవర్గ ముఖద్వారమైన పడుగుపాడు ప్రాంతాన్ని చూస్తుంటే ఇది అక్షర సత్యమనిపిస్తుంది. దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని పడుగుపాడు– వెంకటేశ్వరపురం రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ రూపురేఖలను సమూలంగా మార్చివేసిన ఘనత ఈ ఇద్దరు నేతలకే దక్కుతుంది.
గతంలో అధ్వానంగా రహదారి
గతంలో పడుగుపాడు– వెంకటేశ్వరపురం జాతీయ రహదారి అధ్వానంగా ఉండేది. ఈ రహదారి ఏషియన్ హైవే 16తో నెల్లూరు–ముంబై రహదారిని కలుపుతుంది. అలాగే జాతీయ రహదారి నుంచి నెల్లూరు నగరంలోకి వెళ్లేందుకు ప్రధానమైన రోడ్డుగా ఉంది. జాతీయ రహదారుల పరిధిలోని ఈ రహదారి దశాబ్దాలుగా విస్తరణకు నోచుకోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండేవారు. లారీయార్డు నుంచి వెంకటేశ్వరపురం ఫ్లయిఓవర్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునేవి. మరోవైపు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు అల్లాడిపోయేవారు. ఈ నేపథ్యంలో ఈ రహదారిపై గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రహదారి విస్తరణ ద్వారా పడుగుపాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌తో కలిసి రోడ్డు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించారు.
ఆధునిక హంగులతో ఆరులేన్లుగా..
గత ప్రభుత్వ హయాంలో పడుగుపాడు నుంచి వెంకటేశ్వరపురం వరకు ఆధునిక హంగులతో ఆరు వరుసల రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎన్నికల నాటికి దాదాపుగా పనులు పూర్తయ్యాయి. భారీ వాహనాల రాకపోకలను తట్టుకునేలా అత్యంత నాణ్యమైన బీటీరోడ్లను నిర్మించారు. ఇరువైపులా సర్వీసురోడ్లతో పాటు రెయిలింగులను ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణతో పాటు శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ పనులను చేపట్టడంతో వర్షపు నీటి సమస్యకు చెక్ పడింది. రోడ్డు మధ్యన ఏర్పాటు చేసిన అధునాతన విద్యుద్దీపాలు పడుగుపాడు ప్రాంతానికి కొత్త శోభను తెచ్చాయి. గతంలో చీకటిలో భయం భయంగా వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు ధైర్యంగా రాకపోకలు సాగిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రహణం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పడుగుపాడు– వెంకటేశ్వరపురం రహదారి విస్తరణకు సంబంధించి దాదాపుగా 98 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే అప్పటికి ఎన్నికల కోడ్ రావడంతో కేవలం 200 మీటర్ల రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారి విస్తరణ పనులు ముందుకు సాగలేదు. తుదిదశ పనులకు దాదాపు 18 నెలల గ్రహణం తరువాత మోక్షం కలిగింది. ప్రస్తుతం మిగిలిన పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఈ రహదారిని పెన్నానదిపై కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జితో లింక్ చేయడం వల్ల పాతబ్రిడ్జిపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. జాతీయ రహదారి నుంచి వచ్చే వాహనాలు పడుగుపాడు, వెంకటేశ్వరపురం మీదుగా నెల్లూరు నగరంలోకి ప్రవేశించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఏషియన్ హైవే నుంచి నెల్లూరు నగరంలోకి ఉన్న మిగిలిన లింక్‌రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
అభివృద్ధికే తలమానికం కోవూరు ముఖద్వారం
డబుల్ రోడ్డు నుంచి
ఆరు వరుసల రహదారి విస్తరణ
సెంటర్ లైటింగ్‌తో
వెలుగులీనుతున్న మార్గాలు
మాజీ మంత్రులు నల్లపరెడ్డి, అనిల్ చొరవతో 98 శాతం పనులు పూర్తి
మిగిలిన తుది దశ పనులకు
18 నెలల గ్రహణం తర్వాత మోక్షం
దశాబ్దాల దుస్థితి.. ఐదేళ్ల ప్రగతి
దశాబ్దాల దుస్థితి.. ఐదేళ్ల ప్రగతి
దశాబ్దాల దుస్థితి.. ఐదేళ్ల ప్రగతి
దశాబ్దాల దుస్థితి.. ఐదేళ్ల ప్రగతి
దశాబ్దాల దుస్థితి.. ఐదేళ్ల ప్రగతి


