ఒక్క విద్యార్థికి రూ.14 లక్షల ఖర్చు
ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేయడమే లక్ష్యంగా టీడీపీ పాలన సాగిస్తోంది. నెమ్మదిగా విద్యార్థుల సంఖ్యను తగ్గించి ప్రాథమిక పాఠశాలలే లేకుండా చేసేందుకు అడుగులు వేస్తోంది. విలీన ప్రక్రియ వల్ల కోవూరు నియోజకవర్గంలోని రెండు పాఠశాలలు కేవలం ఒక్కో విద్యార్థితో నడిపిస్తూ రేపటి రోజున వాటిని కూడా మూతపడేలా చేస్తోంది. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో అనేకం ఉన్నాయి.
విద్యార్థుల సంఖ్యను పెంచాలి
చదువు అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు. తోటి విద్యార్థులతో కలిసి ఆడుకోవడం, పోటీ పడడం ద్వారానే పిల్లల్లో మానసిక, సామాజిక ఎదుగుదల సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ ఆ బాబుకు తోటి స్నేహితులే లేరు. ముగ్గురు పెద్దల మధ్య ఆ ఒక్క చిన్నారి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది.
కోవూరు: ‘విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం.. ప్రపంచ స్థాయి ప్రమాణాలు తీసుకొస్తాం’ అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమైంది. కోవూరు మండలంలోని చావడివీధి, ఇనమడుగు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్, ఒక్క విద్యార్థితో కొనసాగుతోంది. అదే తరహాలో బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళెం (వడ్డిపాళెం) ఎంపీపీ పాఠశాల పరిస్థితి ఉంది. ఇలా ఒక్క విద్యార్థి కోసం ఏటా అక్షరాలా రూ.14 లక్షల ప్రజాధనాన్ని వినియోగిస్తోంది.
గణాంకాలు ఇలా..
ఓ వైపు ఉపాధ్యాయుల కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుంటే, ఇక్కడ మాత్రం విరుద్ధ పరిస్థితి కనిపిస్తోంది. నెలకు సుమారు రూ.80 వేల పైచిలుకు జీతం తీసుకునే ఒక ఉపాధ్యాయుడితో పాటు ఆయా వంట మనిషి, మొత్తం ముగ్గురు సిబ్బంది ఆ ఒక్క పిల్లాడికే సేవలు అందిస్తున్నారు. జీతాలు, మధ్యాహ్న భోజన వ్యయం కలిపి ఏడాదికి రూ.14 లక్షలు ఆ ఒక్క విద్యార్థిపై ఖర్చు అవుతోంది.
విలీనమే కారణమా?
గతంలో ఐదో తరగతి వరకు కళకళలాడిన ఈ పాఠశాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అస్తవ్యస్తమైన ‘విలీన’ నిర్ణయాలతో కుదించేశారు. మూడు, నాలుగు, ఐదో తరగతులను మరో పాఠశాలలో కలిపేసి, ఇక్కడ కేవలం ఒక్క విద్యార్థిని మాత్రమే వదిలేశారు.
ప్రాథమిక పాఠశాలలకు విలీన శాపం
చాలాచోట్ల సింగిల్ స్టూడెంట్లకు
పరిమితమైన పాఠశాలలు
విద్యార్థుల సంఖ్యను పెంచకుండా
మీనమేషాలు


