డిపార్ట్‌మెంటల్ పరీక్షలపై సమావేశం
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో రేపటి నుంచి 10వ తేదీ వరకు జరగనున్న డిపార్ట్‌మెంటల్ టెస్ట్ పరీక్షలపై డీఆర్వో విజయ్‌కుమార్ శనివారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు ఉదయం పరీక్షకు 8.30 నుంచి 9.15 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 2.15 గంటల మధ్య మాత్రమే పరీక్ష కేంద్రానికి అనుమతి ఉంటుందన్నారు. ఆలస్యంగా వచ్చిన వారికి 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని తెలిపారు. కాగా పరీక్షల నిర్వహణకు అమసరమైన మౌలిక వసతుల ఏర్పాటు విషయమై తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు వారి హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఫొటో ఆధారిత ధ్రువపత్రం తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.


