ఈవీ స్టేషన్లకు ప్రత్యేక విద్యుత్ ఫీడర్లు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా విద్యుత్ ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య అన్నారు. ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు త్వరలో రానున్న ఎలక్ట్రికల్ బస్సుల కోసం విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశామని, 220 కేవీ అంబాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ ఫీడర్ల ద్వారా వీటికి సరఫరా సులభతరం అవుతుందన్నారు. అనంతరం నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద నిర్మిస్తున్న కంటైనర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను, నగరంలో నిర్మాణంలో ఉన్న 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు శేషాద్రి బాలచంద్ర, శ్రీధర్, పరంధామయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిరణ్, ట్రాన్స్‌కో, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.


