రాష్ట్రస్థాయి కెరీర్ ఎక్స్‌పోకు ఐదు ప్రాజెక్ట్‌లు
నెల్లూరు (టౌన్): సంతపేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో జిల్లాస్థాయి కెరీర్ ఎక్స్‌పో / ఎగ్జిబిషన్‌ను సమగ్రశిక్ష ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. జిల్లా నుంచి నాలుగు విభాగాల్లో 126 నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. విభాగానికి ఒకటి చొప్పున నాలుగింటిని రాష్ట్రస్థాయి కెరీర్ ఎక్స్‌పోకు ఎంపిక చేశారు. హెల్త్ అండ్ బ్యూటీ వెల్నెస్ విభాగం నుంచి బ్రాహ్మణకాక జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి ఆర్షియా.. మోడల్స్ విభాగం నుంచి బుచ్చి జెడ్పీహెచ్‌ఎస్ స్టూడెంట్ సాహితి.. ఒకేషనల్ డ్రస్ అప్ విభాగం నుంచి గండవరం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ప్రేమచరణ్.. పోస్టర్ మేకింగ్ విభాగం నుంచి పేరారెడ్డిపల్లి జెడ్పీహెచ్‌ఎస్ నిహారిక ప్రదర్శించిన ప్రాజెక్ట్‌లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఈ విభాగాల్లో తొలి మూడు నమూనాలను ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.


