ఎన్నాళ్లీ పడిగాపులు
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతినెలా రేషన్ అందుకునేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాలు ఇళ్ల వద్దకే వచ్చి సరుకులు అందించాయి. నేడు లబ్ధిదారులు చౌకదుకాణాలకు వెళ్లి క్యూలైన్లలో నిలబడి రేషన్‌ను మోసుకుంటూ ఇంటికెళ్తున్న దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి. చాలామంది రోజువారీ పనులు మానుకుని వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. బియ్యం తీసుకెళ్లేందుకు వృద్ధులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


