తప్పులుంటే సవరించుకోండి
కొడవలూరు: కొత్తగా పంపిణీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లి ఉంటే సవరించుకోవాలని జేసీ వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని నార్తురాజుపాళెంలో పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు శుక్రవారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పాత పాస్‌పుస్తకాల స్థానంలో కొత్త వా టిని ఈ నెల తొమ్మిది వరకు పంపిణీ చేయను న్నామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, వీఆర్వోలు మల్లికార్జున, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
బ్రిడ్జి కోర్సుల్లో
ఐదు నుంచి శిక్షణ
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో రెండేళ్ల కాలం కలిగిన ట్రేడ్‌లలో శిక్షణ పొంది 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి బ్రిడ్జి కోర్సుల్లో ట్రెయినింగ్‌ను ఇవ్వనున్నామని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ నెల ఐదు నుంచి వచ్చే నెల నాలుగు వరకు శిక్షణను ఇవ్వనున్నామని వివరించారు. ఇక్కడ ఉత్తీర్ణులయ్యే వారు సాంకేతిక విద్య, శిక్షణ శాఖ విజయవాడ వారు నిర్వహించే ప్రవేశ పరీక్షకు అర్హులని తెలిపారు. అక్కడ పాసయ్యే వారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి అర్హత సాధిస్తారని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు అన్ని అవసరమైన పత్రాలతో వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐని సంప్రదించాలని సూచించారు.
రాజకీయ భవిష్యత్తును
నాశనం చేశారు
● ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై
ఆరోపణలు చేసిన మహిళ
ఉదయగిరి: స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తనను రాజకీయంగా వాడుకొని.. రాజకీయ భవిష్యత్తును అంతం చేశారంటూ సోషల్ మీడియా ద్వారా దుత్తలూరు మండలం ఏరుకొల్లుకు చెందిన చల్లా వెంగమాంబ గత నెల 29న ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తన స్వగ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీపై అంకితభావంతో కృషి చేస్తున్న అంశాన్ని గ్రహించి తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నియమించుకున్నారని చెప్పారు. అంగన్‌వాడీ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించడంతో తాను చిత్తశుద్ధితో పనిచేశానన్నారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి లేకపోయినా, ఎమ్మెల్యే ఆశలు రేపారని పేర్కొన్నారు. అయితే కొన్ని నెలల తర్వాత కార్యాలయం నుంచి పంపేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఛానల్లో శుక్రవారం ప్రసారం కావడం ఉదయగిరి నియోజకవర్గ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. పలు వివాదాస్పద అంశాల్లో ఎమ్మెల్యే వార్తల్లోకి ఎక్కుతుండటం ఆ పార్టీ వర్గాలను కలవరపెడుతోంది.


