కోడిపందేల స్థావరాలపై దాడులు
కలిగిరి: మండలంలోని తుర్పుగుడ్లదొన అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై ఎస్సై ఉమాశంకర్ గురువారం దాడులు నిర్వహించారు. పదిమంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. రూ.4,500 నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామాల్లో కోడిపందేలు, పేకాట నిర్వహిస్తుంటే 94407 00098 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
● మనుబోలు: మండలంలోని వడ్లపూడి అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.2,050 నగదు, ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై శివరాకేష్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఆడుకుంటూ తప్పిపోయి..
● తండ్రి చెంతకు బాలుడు
దగదర్తి: తప్పిపోయిన బాలుడిని తండ్రి చెంతకు చేర్చిన ఘటన గురువారం దగదర్తిలో చోటుచేసుకుంది. ఎస్సై జంపాని కుమార్ కథనం మేరకు.. దగదర్తి గ్రామంలో ఉన్న ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ చర్చిలో ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన నల్లగట్ల సుబ్బారాయుడు తన మూడు సంవత్సరాల కుమారుడు అనోస్‌తో ప్రార్థనలకు విచ్చేశాడు. ఈ క్రమంలో అనోస్ ఆడుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. దగదర్తి శివారులోని సున్నపుబట్టి అటవీ ప్రాంతానికి ఏడుస్తూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన విజయనిర్మల అనే మహిళ గమనించింది. బాలుడిని తీసుకుని వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించింది. ఎస్సై తన సిబ్బందితో కలిసి గ్రామంలోని పరిసర ప్రాంతాల వారిని విచారించారు. ఇంతలో సుబ్బారాయుడు తన కుమారుడి కోసం వెతుకుతున్నాడు. దీంతో వివరాలు తెలుసుకుని బాలుడిని అప్పగించారు. విజయనిర్మలను ఎస్సై అభినందించారు.
కిసాన్ కాల్ సెంటర్ ఏర్పాటు
నెల్లూరు(పొగతోట): పంటల సాగు సమయంలో రైతులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు శాస్త్రవేత్తలు, అధికారులతో కిసాన్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారిణి సత్యవాణి తెలిపారు. రైతులు ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య ఫోన్ చేసి సాగులో సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు సంబంధించి సందేహాలను ఒ.వెంకటేశ్వర్లు, యు.వినీత, ఐ.పరమశివ, సీహెచ్ శ్రీలక్ష్మి, పి.మధుసూదన్ తీరుస్తారన్నారు. 0861 – 2327803, 94903 27424 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. వేరుశనగపై ఎ.ప్రసన్న రాజేష్‌కు 94405 66582 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. ఉద్యాన, వ్యవసాయ పంటల్లో తెగుళ్ల నియంత్రణకు సంబంధించి డి.విజయకుమార్ నాయక్‌కు 0861 – 2349356 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఉద్యాన పంటల్లో విత్తన రకాలు, కలుపు నియంత్రణ తదితర వాటిపై పి.లక్ష్మిని 79950 88181 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
ఆటో కార్మికులకు
సహకారం అందించాలి
చిల్లకూరు: రవాణాశాఖాధికారులు ఆటో కార్మి కులకు సహకారం అందించాలని సీఐటీయూ నాయకులు కోరారు. గూడూరు పోటుపాళెం సమీపంలో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో గురువారం నేతలు అధికారులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో కార్మికులు చిన్న పొరపాట్లు చేసిన సమయంలో భారీగా జరిమానాలు వేసి ఇబ్బందులు పెట్టకుండా తొలి హెచ్చరిక ఇవ్వాలన్నారు. తర్వాత అదే తప్పు చేస్తే జరిమానా విధించాలని కోరారు. అలాగే డ్రైవ్ ఒకేసారి చేపట్టి ఆటోల కండీషన్‌ను తనిఖీ చేయాలని, ఇలా చేయడం వల్ల కార్మికులకు ఇబ్బంది ఉండదన్నారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అజాద్ జాకీర్, ఎంవీఐలు ప్రభాకర్, శాంతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బీవీ రమణయ్య, శేఖరయ్య, సయ్యద్ మీరాషా, ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.20 సన్నవి : రూ.14
పండ్లు : రూ.10
కోడిపందేల స్థావరాలపై దాడులు
కోడిపందేల స్థావరాలపై దాడులు


