పక్షుల కేంద్రంలో సందర్శకుల సందడి
దొరవారిసత్రం: నూతన సంవత్సరం సందర్భంగా మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం సందడిగా మారింది. పలు ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు, పర్యాటకులు ఉదయం 9 గంటలకే పక్షుల కేంద్రానికి చేరుకుని విహంగాలను వీక్షించారు.చెరువుల్లోని కడప చెట్లపై విడిది చేసే విహంగాలను వీక్షిచండమే కాకుండా పర్యావరణ కేంద్రంలోని కృత్రిమ విహంగాలు పక్షి జాతుల ప్రాధ్యానతతోపాటు పర్యావరణ కేంద్రంలో జీవన శైలి చిత్రాలను స్థానిక వన్యప్రాణి సిబ్బంది ప్రదర్శించారు. మార్గమధ్యలోని జింకల పార్క్‌లో ఉన్న జింకలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. పిల్లల పార్కులో చిన్నారులు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. తిరుపతి, విజయవాడ, చైన్నె, బెంగళూరు, గూడూరు, నెల్లూరు, చిత్తూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల నుంచి వాహనాల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేశారు. సందర్శకుల కోసం వన్యప్రాణి విభాగం అధికారులు తాగునీటి వసతి, చెరువు కట్టపై ఉన్న వ్యూ పాయింట్లు వద్ద పక్షులను దగ్గరగా వీక్షించేలా బైనోక్యూలర్లు తదితరాలు అందుబాటులో ఉంచారు.
వ్యూ పాయింట్ వద్ద సందర్శకులు
గూడబాతు విన్యాసాలు
పక్షుల కేంద్రంలో సందర్శకుల సందడి
పక్షుల కేంద్రంలో సందర్శకుల సందడి
పక్షుల కేంద్రంలో సందర్శకుల సందడి


