చందన, సీఎంఆర్‌లో లక్కీ డ్రా
నెల్లూరు(బృందావనం): చందన, సీఎంఆర్ ఫెస్టీ వండర్ సందర్భంగా గురువారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆయన సతీమణి కె.సంధ్య డ్రా తీశారు. న్యూ ఇయర్ మలేసియా ట్రిప్ విజేతగా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన పి.సురేష్ నిలిచారు. వీక్లీ డ్రా హీరో ప్లెషర్ స్కూటీ విజేతగా కె.మోహన్‌రెడ్డిని ప్రకటించారు. అలాగే డైలీ డ్రా విజేతలుగా కె.ప్రవీణ (గ్రైండర్), ఎస్‌కే శామ్యూల్ (పాన్‌సెట్), వై.సహస్ర (మిక్సీ), ఎం.గురుప్రకాష్ (మిక్సీ), ఎ.లతిక (డిన్నర్‌సెట్)కు దక్కాయి. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం నెలకొల్పిన చందన, సీఎంఆర్ సంస్థలు ప్రజల ఆదరణ పొంది నెల్లూరీయుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. చందన అధినేత ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతికి బంపర్ ఆఫర్‌గా టాటా టియోగా కారును లక్కీ డ్రా ద్వారా వినియోగదారులకు అందజేస్తున్నామన్నారు. తక్కువ ధరలకే బంగారం, వస్త్రాలు అమ్మకాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మోపూరు పెంచలయ్య, శైలేష్, మేనేజర్లు కిషోర్, వాసు తదితరులు పాల్గొన్నారు.


