
యూరియా కల్తీపై తనిఖీలు
నెల్లూరు(అర్బన్): వ్యవసాయ పంటలకే పరిమితం కాకుండా వివిధ రంగాల ఉత్పత్తుల్లో కల్తీ చేస్తున్న యూరియాను కనుగొనేందుకు పెద్ద ఎత్తున తనిఖీలను నిర్వహించాలని జేసీ కార్తీక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్‌లో అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో యూరియాను ప్లయ్ ఉడ్, పెయింట్ పరిశ్రమలు, పశువుల దాణా తదితరాల్లో అక్రమంగా వినియోగిస్తున్నారనే వార్తలొస్తున్న తరుణంలో, తనిఖీలు చేయాలని సూచించారు. యూరియా పక్కదారి పట్టడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో వ్యవసాయ, విజిలెన్స్, ఇండస్ట్రీస్, రవాణా, పొల్యూషన్ బోర్డు, ఎకై ్సజ్ శాఖల నుంచి ప్రతినిధులను తీసుకొని ఒక టీమ్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు. యూరియాను వ్యవసాయం కాకుండా ఇతర ఉత్పత్తుల్లో వినియోగించారని తేలితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.