అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ నియామకం | - | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ నియామకం

Aug 14 2025 6:58 AM | Updated on Aug 14 2025 6:58 AM

అసిస్

అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ నియామకం

నెల్లూరు (లీగల్‌): నెల్లూరు బార్‌ అసోసియేషన్‌ సభ్యుడు, న్యాయవాది అన్వర్‌బాషాను నెల్లూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌గా నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. ప్రభుత్వం తరఫున సివిల్‌ కేసులను వాదించనున్నారు. పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.

కిలో పొగాకు

గరిష్ట ధర రూ.280

కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280 బుధవారం లభించింది. జనరల్‌ క్లస్టర్‌కు చెందిన రైతులు 379 బేళ్లను తీసుకురాగా, 200 బేళ్లను కొనుగోలు చేయగా, వివిధ కారణాలతో 179ను తిరస్కరించారు. కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280.. కనిష్ట ధర రూ.140.. సరాసరిగా రూ.197.69 లభించిందని వేలం నిర్వహణాధికారి శివకుమార్‌ వివరించారు. 19 కంపెనీలు పాల్గొన్నాయన్నారు.

డీసీపల్లిలో 125 బేళ్ల విక్రయం

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 125 బేళ్లను బుధవారం విక్రయించామని నిర్వహణాధికారి రాజశేఖర్‌ తెలిపారు. వేలానికి 263 బేళ్లు రాగా, వీటిలో 125ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 14287.1 కిలోల పొగాకును విక్రయించగా, రూ.31,67,732.60 వ్యాపారం జరిగిందన్నారు. గరిష్ట ధర కిలో రూ.280.. కనిష్ట ధర రూ.140.. సగటు ధర రూ.221.72గా నమోదైందని వివరించారు. వేలానికి పది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని పేర్కొన్నారు.

మైనింగ్‌

అనుమతులపై ఆందోళన

వరికుంటపాడు: వరికుంటపాడు పంచాయతీలోని జంగంరెడ్డిపల్లి భాస్కరాపురం కొండ తిప్పను మైనింగ్‌ కోసం ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టడాన్ని రైతు కూలీ, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య నేతలు ఖండించారు. వరికుంటపాడు, జంగంరెడ్డిపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణను బుధవారం నిర్వహించారు. తిప్పను మైనింగ్‌కు ఇస్తే నివాస ప్రాంతం ప్రమాదంలో పడుతుందని.. మేకలు, పశువులు తిరగలేకపోతాయని.. పేలుళ్లకు ఇళ్లు దెబ్బతినడంతో పాటు పంటలు నాశనమవుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ నేత లక్ష్మీరెడ్డి మాట్లాడారు. అభివృద్ధి పేరుతో గ్రామాలను నాశనం చేయడాన్ని మానుకోవాలని, మైనింగ్‌ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు కూలీ సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

● రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ చైర్మన్‌ ప్రసాద్‌ను వరికుంటపాడు పంచాయతీ మేధావుల ఫోరం ప్రతినిధులు విజయవాడలో కలిసి అర్జీని అందజేశారు. అనుమతులను తక్షణమే నిలిపేయాలని కోరారు.

రైతులకు విరివిగా

రుణాల మంజూరు

ఉదయగిరి: ఉదయగిరిలోని వివిధ బ్యాంకులు రైతులకు విరివిగా రుణాలను మంజూరు చేయాలని లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మణిశేఖర్‌ పేర్కొన్నారు. స్థానిక సీ్త్ర శక్తి భవనంలో బ్యాంకర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన గడువులోపు నూరు శాతం సాధించాలని సూచించారు. డెయిరీ ఫామ్‌ను ప్రోత్సహించేందుకు ఎక్కువ సంఖ్యలో రుణాలివ్వాలన్నారు. రికవరీ శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు. జన సురక్ష పథకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. బ్యాంకర్లు ఇతర శాఖల అధికారులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కోరారు. మెరుగైన సేవలందించాలని సూచించారు. ఖాతాదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించేలా అధికారులు చూడాలని కోరారు. సమావేశంలో అధికారులు కాశయ్య, రవిశంకర్‌ జయదేవ్‌, ఎంపీడీఓలు అప్పాజీ, గోపి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ నియామకం 1
1/1

అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement