నెల్లూరు(బారకాసు): నగరంలో ప్లాస్టిక్ వినియోగం నానాటికీ తీవ్రమవుతోంది. దీన్ని ఉపయోగిస్తే ప్రమాదం సంభవిస్తుందనే అంశంపై విస్తృతంగా ప్రచారం చేసిన నగరపాలక సంస్థ తదనంతరం మిన్నకుండిపోయింది. మొదట్లో ప్లాస్టిక్ విక్రేతలు తదితరులపై దాడులు జరిపి జరిమానాలు విధించిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో కొన్నాళ్ల పాటు తగ్గిన ఈ ప్రక్రియ తిరిగి యథాస్థితికి చేరుకుంది.
నగరంలో ఇలా..
నగరంలోని స్టోన్‌హౌస్‌పేట, రేబాలవారివీధి, చిన్నబజార్, పెద్దబజార్, పణతులవారివీధి తదితర ప్రాంతాల్లో హోల్‌సేల్ ప్లాస్టిక్ దుకాణాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడి నుంచి భారీగా వ్యాపారం జరుగుతోంది. తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, పూల దుకాణాలు, కూరగాయల మార్కెట్ తదితరులు నిషేధిత ప్లాస్టిక్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వస్త్ర సంచులను వినియోగించాలని ఎంతో మంది ప్రచారం చేస్తున్నా, ఎలాంటి ప్రయోజనం కానరావడంలేదు. సంబంధిత అధికారులు ఇప్పటికై నా దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తగ్గుముఖం పట్టిన తనిఖీలు
పుంజుకుంటున్న వినియోగం
పర్యావరణ పరిరక్షణ ప్రశ్నార్థకం..?
చర్యలు చేపడతాం
ప్లాస్టిక్ నియంత్రణకు త్వరలోనే చర్యలు చేపడతాం. నిషేధిత ప్లాస్టిక్‌ను ఎవరూ వినియోగించరాదు. డ్రైవ్‌లను తర చూ చేపట్టి ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తాం. వీటికి దూరంగా ఉండాలి.
– కనకాద్రి, ఎంహెచ్‌ఓ, నగరపాలక సంస్థ
ప్లాస్టిక్ భూతం అంతమెప్పటికో..?
ప్లాస్టిక్ భూతం అంతమెప్పటికో..?