డివిజన్లు విద్యుత్‌ సర్వీసులు స్మార్ట్‌ మీటర్లు | - | Sakshi
Sakshi News home page

డివిజన్లు విద్యుత్‌ సర్వీసులు స్మార్ట్‌ మీటర్లు

Aug 14 2025 7:19 AM | Updated on Aug 14 2025 7:19 AM

డివిజ

డివిజన్లు విద్యుత్‌ సర్వీసులు స్మార్ట్‌ మీటర్లు

ఇప్పటికే పలు ప్రభుత్వ,

వాణిజ్య సంస్థల్లో మీటర్ల ఏర్పాటు

మాకొద్దు మహాప్రభో అంటున్నా పట్టించుకోని సర్కార్‌

పూటపూటకూ మారనున్న

టారిఫ్‌తో ప్రజల బెంబేలు

రీచార్జి చేస్తేనే ఇంట్లో కరెంట్‌

నెల్లూరు (వీఆర్సీసెంటర్‌): సీఎం చంద్రబాబు మార్కు మోసాల్లో తాజాగా మరొకటి చేరింది. స్మా ర్ట్‌ మీటర్లను బిగించబోమంటూ గతంలో కల్లబొల్లి కబుర్లు చెప్పిన ఆయన తాజాగా వీటి ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారు. ఈ పరిణామం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. అసలీ స్మార్ట్‌ మీటర్ల గోల ఏమిటానని వారు ఆందోళనకు గురవుతున్నారు.

గుడ్లు తేలేస్తున్నారు..

కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో వీటిని ఏర్పాటు చేశారు. తదనంతరం 200 యూనిట్లు వాడే ప్రతి గృహంలోనూ బిగించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నెలకొల్పారు. పాత మీటర్ల స్థానంలో వీటిని ఏర్పాటు చేశాక, విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయి. దీనిపై వినియోగదారులతో పాటు వామపక్ష పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలనూ చేపడుతున్నారు.

నాలుగింతలు అధికంగా..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యుత్‌ సర్వీసులు 9,64,379 ఉండగా, ఇందులో వ్యవసాయ సర్వీసులు 1,46,185. ప్రస్తుతానికి వీటిని మాత్రం స్మార్ట్‌ మీటర్ల నుంచి మినహాయించారు. నగరంలోని ఓ పిండిమిల్లు యజమానికి గతంలో నెలకు రూ.ఆరు బిల్లొచ్చేది. అయితే స్మార్ట్‌ మీటర్‌ను ఏర్పాటు చేశాక, ఏకంగా రూ.26 వేలొచ్చింది. మరో దుకాణ యజమానికి నెలకు రూ.మూడు వేల బిల్లు వస్తుండగా, ఆపై ఇది రూ.ఐదు వేలకు పెరిగింది.

టారిఫ్‌ తంటాలు

ఈ విధానంతో టారిఫ్‌ సైతం మారనుంది. గతంలో పాత మీటర్లు ఉన్న సమయంలో రోజంతా ఒకే టారిఫ్‌తో నెల బిల్లొచ్చేది. అయితే వినియోగించే యూనిట్లు అధికమయ్యే కొద్దీ ఇది మారుతూ ఉండేది. 0 – 30 యూనిట్ల వరకు ఒక టారిఫ్‌.. 31 – 75.. 76 – 125.. 126 – 225.. 226 – 400.. 400 –500 యూనిట్ల వరకు ఉండేది. అయితే స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకలా.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మరోలా.. సాయంత్రం నుంచి తెల్లవారు వరకు మరో టారిఫ్‌లో బిల్లులొచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ మీటర్‌ ధర రూ.20 వేలకుపైగా ఉంటుంది. ఏర్పాటు సమయంలో ప్రజల నుంచి ఎలాంటి నగదును కట్టించుకోకుండా, మీటర్‌ ధర మొత్తాన్ని బిల్లులో కలుపుతారేమోననే అనుమానం తలెత్తుతోంది.

ఇక అంతా ప్రీపెయిడే..

వాస్తవానికి గతంలో నెలంతా వాడుకున్న యూనిట్లకు లెక్క కట్టి రీడింగ్‌ తీసి బిల్లులిచ్చేవారు. దీన్ని 15 రోజుల్లో చెల్లించే వెసులుబాటు ఉండేది. అయితే ఇక నుంచి ఈ అవకాశం ఉండదు. మొబైల్‌ ఫోన్లలో ప్రీపెయిడ్‌ తరహాలో ఇక ముందే రీచార్జి చేసుకోవాలి. ఒకవేళ ఇది పూర్తయితే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయే ప్రమాదమూ ఉంది. ఇది సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మోత మోగుతున్న విద్యుత్‌ బిల్లులు

‘విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లకు తాము వ్యతిరేకం.. వీటిని ఏర్పాటు చేస్తే పగలగొట్టండి’ అంటూ గతంలో టీడీపీ నేతలు సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రక్రియను ఉపసంహరిస్తామంటూ ఎన్నికల

సమయంలో హామీలనూ గుప్పించారు. తీరా కొలువుదీరాక, వీటిని బిగించే

ప్రక్రియను ముమ్మరం చేయడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు వీటిని ఏర్పాటు చేశారు. ఆపై

గృహాల్లోనూ బిగించేందుకు ఉపక్రమించడంపై ప్రజలు మండిపడుతున్నారు.

డివిజన్లు విద్యుత్‌ సర్వీసులు స్మార్ట్‌ మీటర్లు 1
1/1

డివిజన్లు విద్యుత్‌ సర్వీసులు స్మార్ట్‌ మీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement