
తల్లి, కుమారుడి అదృశ్యం
నెల్లూరు(క్రైమ్): తల్లి, కుమారుడు అదృశ్యం ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. భక్తవత్సలనగర్‌లో ప్రకాష్ కుటుంబం నివాసం ఉంటోంది. అతడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈనెల నాలుగో తేదీన భార్య, చిన్నకుమారుడు ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. బాధిత కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. జాడ తెలియరాకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆత్మకూరు: మండలంలోని వాశిలి గ్రామం వద్ద నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆత్మకూరు ఎస్సై ఎస్‌కే జిలానీ, స్థానికుల కథనం మేరకు.. వాశిలి గ్రామానికి చెందిన షేక్ అన్వర్ (59) అనే వ్యక్తి నవరంగ మేళం బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. బుధవారం ఉద యం ఆత్మకూరుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి టీవీఎస్ మోపెడ్‌పై వస్తున్నాడు. గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తుండగా నెల్లూరు నుంచి బద్వేల్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వాహనాలు రోడ్డు పక్కన గుంతలో పడిపోయాయి. అన్వర్ అక్కడికక్కడే మృతిచెందా డు. సమాచారం అందుకున్న ఎస్సై జిలానీ ఘట నా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇంటి పెద్ద అన్వర్ మృతి చెందడంతో ఆ కుటుంబీకులు తీవ్రంగా రోదిస్తున్నారు. ప్రభుత్వంఆదుకోవాలని కోరారు.
చోరీ సొత్తు రికవరీ
ఉదయగిరి: ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చోరీకి పాల్పడిన బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. జూన్ 10వ తేదీ రాత్రి ఏఎంసీ కార్యాలయ కిటికీలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించి కంప్యూటర్లు, ఇతర సామగ్రి చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పట్టణంలోని షబ్బీర్ కాలనీకి చెందిన ఓ బాలుడు చోరీ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని జువనైల్ కోర్టులో హాజరుపరిచామని ఎస్సై తెలిపారు.
492 బస్సుల
కేటాయింపు
నెల్లూరు సిటీ: మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి జిల్లాలో 492 బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి షేక్ షమీమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు డిపో పరిధిలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు కలిపి 61, కందుకూరులో 60, కావలిలో 90, నెల్లూరు డిపో–1లో 91, డిపో–2లో 90, రాపూరులో 49, ఉదయగిరిలో 51 బస్సులను సిద్ధం చేశామన్నారు. శుక్రవారం నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో మంత్రి నారాయణ ఈ పథకాన్ని ప్రారంభిస్తారన్నారు.
త్వరలో విజయవాడలో యానాది గర్జన
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఎస్టీ వర్గీకరణ కోసం త్వరలో విజయవాడలో యానాది గర్జన నిర్వహిస్తామని యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్రాధ్యక్షుడు కేసీ పెంచలయ్య తెలిపారు. నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్‌లో బుధవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించి తీర్మానాలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణపై, యానాదుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నేతలు బాపట్ల బ్రహ్మయ్య, తలపల చెంచు మల్లికార్జునరావు, బాకుల మురళి, తిరువెళ్ల శీను, నీలం సురేంద్ర, మానికల మురళి తదితరులు పాల్గొన్నారు.