
సెమీ కండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులు
నెల్లూరు రూరల్: భారత్‌లో సెమీ కండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులను జపాన్ తదితర దేశాలు పెడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. తిరుపతిలోని టెక్నాలజీ పార్కులో రూ.400 కోట్లతో పరిశ్రమను స్థాపించనున్నారని తెలిపారు. కార్యకర్తలను కలిసి చాయ్ పే కార్యక్రమంలో అందర్నీ సమన్వయం చేయాలనే ఉద్దేశంతో యాత్రను చేపడుతున్నామని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, రవిచంద్రరెడ్డి, కందికట్ల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.