
జెడ్పీలో ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామకాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 17 మంది ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు కల్పించారు. జెడ్పీలో పని చేస్తూ మరణించిన ఇద్దరు ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియమకాల కింద ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, జెడ్పీ సీఈఓ మోహన్‌రావు మంగళవారం అందజేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ అరుణమ్మ మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన 2021 నుంచి ఇప్పటి వరకు 137 మంది ఉద్యోగులకు ఉద్యోగోన్నతలు, 83 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ నెలఖారులోపు 25 మంది రికార్డు అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్కాకుల పెంచలయ్య, వి దేవప్రస్నకుమార్ చైర్‌పర్సన్ అరుణమ్మ, సీఈఓ మోహన్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ అధికారులు రవికుమార్, సుబ్రహ్మణ్యం, వాసుదేవరావు, ఉద్యోగులు ముజీర్, అనిల్‌కుమార్, భీమ్‌రెడ్డి పాల్గొన్నారు.