
వైఎస్ జగన్‌కు రాఖీ కట్టిన కాకాణి పూజిత
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, డాక్టర్ అశ్వంత్‌రెడ్డి దంపతులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డిని కాకాణి పూజిత శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి రాఖీ కట్టారు.
జిల్లా అధికారులు,
ఎంపీడీఓలకు రేపు శిక్షణ
నెల్లూరు (పొగతోట): పంచాయతీరాజ్ అడ్వాన్స్‌మెంట్ ఇన్‌డెక్స్‌పై ఈ నెల 14వ తేదీన లైన్ డిపార్ట్‌మెంట్స్ జిల్లా అధికారులు, డివిజనల్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఉప మండల పరిషత్ అధికారులు, కంప్యూటర్ ఆపరేట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ మోహన్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 14న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. శిక్షణ కార్యక్రమానికి అందరు తప్పకుండా హాజరుకావాలని తెలిపారు.
సీఐడీ కేసులో కాకాణికి
బెయిల్ మంజూరు
నెల్లూరు (లీగల్): ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పొదలకూరు పోలీసులు నమోదు చేసిన తర్వాత సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న అక్రమ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ నెల్లూరు 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎల్.శారదారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరు రూ.25 వేలు ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్‌దారులు పూచీకత్తు, రూ.25 వేలు వ్యక్తిగత బాండు కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ పోలీసుల విచారణకు కాకాణి సహకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, పి. ఉమామహేశ్వర్ రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో గోవర్ధన్‌రెడ్డిని 14వ నిందితుడిగా కేసు బనాయించారని వాదనలు వినిపించారు. అనంతరం పోలీసుల తరఫున ప్రత్యేక పీపీ మాల్యాద్రి వాదనలు వినిపిస్తూ కేసు దర్యాప్తు దశలో ఉందని కాకాణికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శారదరెడ్డి గోవర్ధన్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
బీజేపీ జేబు సంస్థగా ఈసీ
నెల్లూరు (వీఆర్సీసెంటర్): కేంద్ర ఎన్నికల కమిషన్‌ను బీజేపీ తన జేబు సంస్థగా మార్చేసుకుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నగరంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు చోరీకి గురవుతోందని రాహుల్‌గాంధీ ఆధారాలతో నిరూపించి శాంతియుతంగా నిరసన చేస్తుండగా, పలువురు ఎంపీలను అరెస్ట్ చేయడం ప్రజాసామ్యంలో చీకటి రోజు అన్నారు. దేశ ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేసే క్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీ ర్యం చేస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సంజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు తలారి బాసుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ జగన్‌కు రాఖీ కట్టిన కాకాణి పూజిత

వైఎస్ జగన్‌కు రాఖీ కట్టిన కాకాణి పూజిత