
ప్రో కబడ్డీ రెఫరీగా శ్రీనివాసరావు
ఉలవపాడు: యువ ఆంధ్ర ప్రో కబడ్డీ సీజన్–1 రెఫరీగా కరేడు గ్రామానికి చెందిన సాదం శ్రీనివాసరావు ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ సోమవారం తెలిపారు. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలో జరిగే సీజన్–1లో రిఫరీగా వ్యవహరిస్తారన్నారు. ఆంధ్ర కబడ్డీ రిఫరీస్ బోర్డు నుంచి ఎంపిక చేసినట్లు తెలిపారు. అసోసియేషన్ రెఫరీస్ బోర్డు చైర్మన్ మురళీకుమార్, కన్వీనర్ రవీంద్ర, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కరరావు, సెక్రటరీ పూర్ణచంద్రరావులకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.