
ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ తప్పనిసరి
● ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీ
నెల్లూరు (అర్బన్): ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు నిర్వహిస్తున్న డాక్టర్లు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ సుజాత తెలిపారు. నమోదు చేసుకుని గడువు ఐదేళ్లు పూర్తవుతున్న వారు ఒక నెల రోజులు మందుగానే ఆన్‌లైన్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం డీఎంహెచ్‌ఓ సుజాత నగరంలోని నారాయణ, అపోలో, ఎనెల్ తదితర పలు ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలు, వివరాల రికార్డులను పరిశీలించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా.. లేదా తెలుసుకునేందుకు 13 మంది అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి ఈ నెల 13వ తేదీ వరకు తనిఖీలు జరిపిస్తున్నామన్నారు. ఆస్పత్రులను ఆంధ్రప్రదేశ్ అల్లోపతి క్లినికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ 2002 ప్రకారం నమోదు చేసుకోకుండా ఉంటే అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం తప్పనిసరిగా పొల్యూషన్, ఫైర్, బయోమెడికల్ వేస్టేజి లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. ఆస్పత్రులు అందిస్తున్న సేవలు, అందుకు వసూలు చేస్తున్న ధరలు బోర్డులో ప్రదర్శించాలన్నారు. ఓపీ, ఐపీ రిజిస్టర్లు, కేస్‌షీట్లు పక్కాగా ఉండాలన్నారు. ఈ తనిఖీల్లో ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ భాస్కర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
21 నుంచి విద్యుత్
క్రీడాకారుల ఎంపిక
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీఈపీడీసీఎల్ నేతృత్వంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ సర్కిల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సర్కిల్ స్పోర్ట్స్, గేమ్స్ సెక్రటరీ రామస్వామివేలు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి, అర్హత ఉన్న జిల్లా సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగులు, జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్–2 ఉద్యోగులు అర్హులని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు నగరంలోని స్టౌన్‌హౌస్‌పేటలోని మైడ్రీమ్ క్లబ్‌లో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు 90308 02038, 98851 84450 నంబర్లను సంప్రదించాలని కోరారు.
రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్‌కు
చాకిచర్ల విద్యార్థి
ఉలవపాడు: రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్‌కు చాకిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చైతన్యకృష్ణ ఎంపికై నట్లు వ్యాయామ అధ్యాపకుడు ఓగుబోయిన శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ నెల 10వ తేదీలో విశాఖపట్నం పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో జరిగే సబ్ జూనియర్ షాట్‌ఫుట్ విభాగంలో నెల్లూరు జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన పారా స్పోర్ట్స్ క్రీడల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థి ఎంపిక కావడంతో హెచ్‌ఎం జనార్దన్ అభినందనలు తెలిపారు.

ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ తప్పనిసరి