
పేదల కడుపు కొడుతున్న పచ్చ నేతలు
ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలో 246 చౌక దుకాణాల పరిధిలో సుమారు 89 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ డీలర్లు దళారులను ఏర్పాటు చేసుకుని లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి కావలి, కొడవలూరు, నెల్లూరుల్లో రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. వీరికి స్థానికంగా పోలీసులు, సివిల్ సప్లయీస్ శాఖలు అండగా ఉంటున్నాయి. అక్కడి నుంచి ముత్తుకూరు పోర్టుకు చేర్చి శ్రీలంకతోపాటు ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని సమాచారం. ఉదయగిరి నియోజకవర్గం నుంచి పీడీయస్ బియ్యాన్ని కావలి, జలదంకి మండలాలకు చెందిన ఇద్దరు వ్యాపారులు సేకరించి అక్రమంగా బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక వ్యాపారులు డీలర్లు, లబ్ధిదారుల నుంచి రూ.15 వరకు కేజీ బియ్యం కొనుగోలు చేస్తారు. వారు రేషన్ వ్యాపారం చేసే అక్రమార్కులకు రూ.21లకు అమ్ముతారు. వారు రేషన్ మాఫియాకు రూ.29లకు విక్రయిస్తారు. మూడు నెలల క్రితం జలదంకి మండలానికి చెందిన ఓ పచ్చ నేత అక్రమంగా బియ్యం తరలిస్తుండగా చామదలలో స్థానికులు పట్టించారు. కానీ పోలీసులు లారీలో ఉన్న సరుకులో కొంత భాగం అటోకు ఎక్కించి లారీలో సరుకు బిట్రగుంటలోని ఓ రైస్‌మిల్లుకు తరలించి నేర తీవ్రతను తగ్గించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు నెలల క్రితం కొండాపురం మండలం మర్రిగుంటలో అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యంను పోలీసులు పట్టుకుని, బొలేరో వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేశారు.