వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ఘటన చూశాక ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా మా? ఆటవిక రా జ్యంలో ఉన్నామా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వైఎస్సార్‌సీపీ నేత వేల్పుల రాముపై టీడీపీ గూండాలు దాడి చేసి గాయ పరచడం చేస్తే ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టడం కష్టంగా అనిపిస్తోంది. ఓ శాసనమండలి సభ్యుడికే పోలీసులు కనీస రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటి. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజలను భయాందోళనకు గురి చేసి గెలవాలని చూడడం హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వాతంత్య్రాన్ని, ఎన్నికల స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై కఠిన చర్య తీసుకోవాలి. ఎన్నికల కమిషనర్ తక్షణమే జోక్యం చేసుకొని చర్యలు చేపట్టాలి. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి.
– మేకపాటి విక్రమ్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, ఆత్మకూరు
పులివెందుల ఘటన
అరాచకానికి పరాకాష్ట
పులివెందుల ఘటన టీడీపీ అరాచకానికి పరాకాష్టగా ఉంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి విజయం కోసం అడ్డుదారులు తొక్కుతున్నారు. సాఫీగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని, ముందస్తు వ్యూహంలో భాగంగా భౌతికదాడులకు తెగిస్తున్నారు. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌తోపాటు మరొకరిపై హత్యాయత్నం జరగడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. అధికారం మదంతో ఎల్లో సైకో బ్యాచ్ వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్‌లో స్వేచ్ఛాయుత ఎన్నికలకు గొడ్డలిపెట్టుగా మారుతోంది. గత ఐదేళ్ల ఫ్యాక్షనిజానికి దూరంగా ఉన్న సీమ పల్లెల్లో టీడీపీ తిరిగి తెస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారిని భయపెట్టి బూత్‌లు ఆక్రమించి ఎన్నికల్లో లబ్ధిపొందే ప్రయత్నం చేయడం తగదు.
– మేకపాటి రాజగోపాల్‌రెడ్డి,
ఉదయగిరి సమన్వయకర్త
బ్రిటిష్ పాలనను
తలపిస్తున్న కూటమి
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రత్యర్థులపై దాడులు చేయడం, ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం చూస్తుంటే బ్రిటిష్ పాలన కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతుంది. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్‌సీపీ నేత వేల్పుల రాముపై నేతలపై దాడి చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఓ ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుడికి రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఉంటుందా. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తమ అధికారంతో ప్రజలను భయాందోళనలకు గురి చేసి, గెలవాలని చూస్తుంది. ఎన్నికల స్వేచ్ఛ ఆటంకం కలిగించే వారిపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
– కాకాణి పూజిత, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్
ఆటవిక రాజ్యంలో ఉన్నామా?
ఆటవిక రాజ్యంలో ఉన్నామా?