
ఓటమి భయంతోనే టీడీపీ అరాచకం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్ కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ బీసీ సంఘాల జిల్లా నాయకులు మండిపడ్డారు. పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై జరిగిన అరాచకమైన దాడిని ఖండిస్తూ గురువారం నగరంలోని మినీబైపాస్ రోడ్డులో మహాత్మా జ్యోతిరావుపూ లే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ప్రజల విశ్వాసానికి దూరం కావడం వల్లే పోలీసుల సాయంతో ఉప ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానం వైఎస్సార్‌సీపీదేనని, దురదుష్టవశాత్తూ ప్రమాదంలో ఆ జెడ్పీటీసీ మరణిస్తే ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారన్నారు. పదవీ కాలంలో ఏడాదే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికల్లో రూ.కోట్లల్లో డబ్బు ఖర్చుపెట్టి, అధికార దుర్వనియోగానికి పాల్పడుతుందన్నారు.
గాయపడిన వారిపైనే కేసులా?
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో తాము జెడ్పీటీసీని కై వసం చేసుకున్నామని చెప్పుకోవడానికి చంద్రబాబు అత్యంత నీచానికి దిగజారుతున్నారన్నారు. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌తోపాటు తమ పార్టీ నాయకులు వేల్పులు రాముపై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించారన్నారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి చావుబ్రతుల్లో ఉన్న వేల్పుల రాము మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ స్థాయిని మరిచి విడ్డూరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేశ్ చెప్పినట్లు చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు బనాయిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారన్న విషయం మరిచి పోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర మహిళా విభాగం సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పులివెందులలో టీడీపీని గెలిపించే బాధ్యత ఖాకీలపై పెట్టారా?
గీత దాటిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
వైఎస్సార్‌సీపీ బీసీ సంఘాల జిల్లా నాయకులు