
సర్వేపల్లిలో బరి తెగింపు
పొదలకూరు: సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు, మనుబోలు మండలాల్లో అధికార పార్టీ నాయకులు అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ముత్తుకూరు పిడతాపోలూరు చెరువులో మట్టిని ఇష్టానుసారం అక్రమంగా సమీపంలోని లే అవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మనుబోలు మండలంలో అవసరాన్ని బట్టి తరచుగా గ్రావెల్ తవ్వుతున్నారు. ఫిర్యాదులు అందితే కొద్ది రోజులు ఆపి తర్వాత గ్రావెల్‌ను తరలిస్తున్నారు. వెంకటాచలం మండలంలో అక్రమంగా గ్రావెల్ రూ.కోట్లలో నిర్వహిస్తున్నారు. సర్వేపల్లి పంచాయతీ నాగబొట్లకండ్రిక గ్రామ అటవీ భూముల్లో స్వయంగా ముఖ్య నాయకుడు కనుసన్నల్లో ముత్తుకూరు మండలం సాగరమాల ప్రాజెక్ట్ (హైవే రోడ్డు నిర్మాణం), నెల్లూరు లేఅవుట్లకు తరలిస్తున్నారు. ప్రతినిత్యం రూ.20 లక్షల విలువైన గ్రావెల్‌ను అటవీ భూముల్లో తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు అధికార ఒత్తిళ్లతో పట్టించుకోవడం లేదు. పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ కొల్లకందుకూరు తిప్ప నుంచి పది రోజులుగా గ్రావెల్‌ను నెల్లూరు లే అవుట్లకు తరలిస్తున్నారు. ప్రతి నిత్యం 20 టిప్పర్లు తరలిపోతున్నాయి. టిప్పర్‌కు రూ.5 వేలు వసూలు చేసి ప్రతి నిత్యం రూ.లక్ష సంపాదిస్తున్నారు. గ్రావెల్‌ను యంత్రాలతో లోడి టిప్పర్లకు నింపి పంపుతున్నారు.

సర్వేపల్లిలో బరి తెగింపు