రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు

Apr 30 2025 12:14 AM | Updated on Apr 30 2025 12:14 AM

రేపటి

రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు

క్రీడ శిక్షణా శిబిరాలు

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన గ్రామీణ, మండల, జిల్లా కేంద్రాల్లో మొత్తం 50 శిక్షణా శిబిరాలను నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులకు వ్యాయామ విద్య, ఉపాధ్యాయులు, సీనియర్‌ క్రీడాకారులతోపాటు జిల్లా కేంద్రంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సంబంధిత క్రీడా శిక్షకులతో ప్రాథమిక స్థాయి నుంచి వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇవ్వనున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ శిబిరాల్లో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తారు.

1. అథ్లెటిక్స్‌ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు

2. ఆర్చరీ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు

3. హాకీ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు

4. స్విమ్మింగ్‌ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు

5. బ్యాడ్మింటన్‌ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు, యూత్‌ క్లబ్‌, ఏలూరుపాడు, గుడ్లూరు

6. బాస్కెట్‌ బాల్‌ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు, వీఆర్‌ కాలేజ్‌, జేబీ కాలేజ్‌, విట్స్‌ కాలేజ్‌ కావలి

7. ఫుట్‌బాల్‌ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు, సెయింట్‌ జాన్స్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌, నెల్లూరు,

సెయింట్‌ పీటర్స్‌ స్కూల్‌, సంతపేట నెల్లూరు, జెడ్పీ హైస్కూల్‌, ఉలవపాడు,

ఇంటర్మీడియట్‌ కాలేజ్‌, కందుకూరు, పాలిటెక్నిక్‌ కాలేజ్‌, వెంకటేశ్వరపురం,

కొత్తూరు, నెల్లూరు రూరల్‌, బిట్రగుంట గ్రౌండ్స్‌, కావలి, కలివెలపాళెం, మహ్మదాపురం

8. కబడ్డీ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు, జెడ్పీ హైస్కూల్‌,

డమ్మాయపాళెం, ముత్తుకూరు, కావలి, కరేడు

9. ఖోఖో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం, నెల్లూరు, బీవీఎస్‌ మున్సిపల్‌ బాలికల హైస్కూల్‌,

నవాబుపేట, నెల్లూరు, జెడ్పీ హైస్కూల్‌ డమ్మాయపాళెం, ముత్తుకూరు,

ఎంవీఆర్‌ఆర్‌ జెడ్పీ హైస్కూల్‌ నర్సాపురం, ఇందుకూరుపేట

10. వాలీబాల్‌ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు, ఎన్‌టీఆర్‌నగర్‌ పార్కు, నెల్లూరు, సర్వోదయ డిగ్రీ కాలేజీ, నెల్లూరు, మున్సిపల్‌ స్కూల్‌ రంగనాయకులపేట, నెల్లూరు,

జవహర్‌భారతి డిగ్రీ కాలేజీ, కావలి

11.క్రికెట్‌ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు, కొత్తపల్లి, అనంతసాగరం, సీతారామపురం

12. సాఫ్ట్‌బాల్‌ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం, గవర్నమెంట్‌ హైస్కూల్‌, ఆత్మకూరు

13.చెస్‌ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం, నెల్లూరు

14. తైక్వాండో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం, నెల్లూరు, జెడ్పీ హైస్కూల్‌, విశ్వనాథరావుపేట బోగోలు

15.యోగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు, బారకాసు లైబ్రరీ,పెద్దబజారు, ఏఐఎంఎస్‌ స్కూలు, బీవీనగర్‌, స్వతంత్ర పార్కు,

గాంధీబొమ్మ సెంటర్‌, ఎన్‌టీఆర్‌ పార్కు అన్నమయ్య సర్కిల్‌, నెల్లూరు

16. బాల్‌ బ్యాడ్మింటన్‌ జవహర్‌ భారతి డిగ్రీ కాలేజ్‌, కావలి

17. నెట్‌బాల్‌ జెడ్పీ హైస్కూల్‌, పాటూరు, కోవూరు

18. రోలర్‌ స్కేటింగ్‌ చిల్డ్రన్స్‌ పార్కు, నెల్లూరు

19. సపక్‌తక్రా ఎలిమెంటరీ హైస్కూల్‌, ఎన్‌వీ గార్డెన్స్‌ నెల్లూరు, జెడ్పీ హైస్కూల్‌ గ్రౌండ్స్‌,

కొత్తూరు, ఇందుకూరుపేట

20. టెన్నీస్‌ శ్రీధర్‌ టెన్నీస్‌ అకాడమీ, నెల్లూరు, జవహర్‌భారతి డిగ్రీ కాలేజ్‌, కావలి,

21. ఫెన్సింగ్‌ రెయిన్‌బో స్కూల్‌ బుచ్చిరెడ్డిపాళెం

సద్వినియోగం చేసుకోవాలి

వేసవిలో నెల రోజుల పాటు నిర్వహించే శిక్షణా శిబిరాలను జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఉన్న చిన్నారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలి. వేసవి శిక్షణా శిబిరాల్లో క్రీడా ప్రస్తానం ప్రారంభించిన చిన్నారులు భవిష్యత్‌లో ఎంతో మంచి క్రీడాకారులుగా ఎదిగారు. ఆయా క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, తమ ప్రాంతాల్లో చిన్నారులు ఈ శిక్షణా శిబిరాలకు హాజరయ్యేలా సహాయ సహకారాలు అందించాలి.

– ఆర్‌కే యతిరాజ్‌, డీఎస్‌డీఓ

రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు 1
1/1

రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement