
అంబరాన్నంటిన రంగడి సంబరం
రంగడి రథోత్సవం
నెల్లూరు(బృందావనం): నెల్లూరులో పవిత్ర పినాకినీ తీరాన రంగనాయకులపేటలో శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి రథోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయదేవేరులతో సర్వాలంకార శోభితంగా తీర్చిదిద్దిన తిరుత్తేరు (రథం)పై కొలువైన రంగనాథుడిని దర్శించుకునేందుకు తరలివచ్చిన అశేష భక్తజనంతో మాడవీధులు పోటెత్తాయి. దాదాపు ఐదున్నర గంటలకు పైగా ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. తొలుత ఆలయంలో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం స్వామి ఉభయ దేవేరులతో తూర్పు రాజగోపురం సమీపంలో ఉన్న రథమండపం వద్ద తిరుత్తేరులోకి వేంచేపు చేశారు. వివిధ పూజల తర్వాత మండం నుంచి రథం పినాకినీ తీరం వైపు ఉన్న ఉత్తర మాడవీధి వైపునకు అనంతరం తూర్పున ఉన్న గోపురం వీధి రైల్వేగేట్ వరకు అక్కడి నుంచి తిరిగి గోపురం వీధి, రంగనాయకులపేట, సంతపేట, నాలుగుకాళ్ల మండపం వరకు, అక్కడి నుంచి వెనుదిరిగి మండపం వరకు జరిగింది.
● బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంప్రదాయంగా నాలుగు కాళ్ల మండపం వద్ద లక్ష్మీదేవి, చెంచులక్ష్మి సమేత వేదగిరి లక్ష్మీనృసింహస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.
వైభవంగా రథోత్సవం
తరలివచ్చిన అశేష భక్తజనం
వేడుకగా ఎదురుకోలోత్సవం

అంబరాన్నంటిన రంగడి సంబరం

అంబరాన్నంటిన రంగడి సంబరం