విత్తన సబ్సిడీకి కత్తెర | - | Sakshi
Sakshi News home page

విత్తన సబ్సిడీకి కత్తెర

Oct 25 2024 12:16 AM | Updated on Oct 25 2024 12:16 AM

విత్త

విత్తన సబ్సిడీకి కత్తెర

కూటమి ప్రభుత్వానికి అన్నదాతలంటే లెక్క లేకుండా పోయింది. వారికి అన్ని విధాలా అండగా ఉండాల్సిందిపోయి కష్టాల్లోకి నెడుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా ప్రతి విషయంలో ఆదుకోగా నేటి చంద్రబాబు సర్కారు రాయితీల్లో కోతలు విధిస్తోంది. దీంతో రైతుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి.

శనగ పంట (ఫైల్‌)

రాయితీ తగ్గించడం దారుణం

రెండేళ్లుగా సకాలంలో వర్షాలు కురవడం లేదు. శనగ సబ్సిడీ గతేడాది 40 శాతం ఇచ్చారు. ఇప్పుడు అధిక ధరకు విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడి పెరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే విత్తన శనగ ధర బయట మార్కెట్‌కు మించి ఉంది.

– సూరె కొండారెడ్డి, బ్రహ్మేశ్వరం, రైతు

దుత్తలూరు: అన్నదాతలకు శనగ విత్తనాల కొనుగోలు భారంగా మారింది. పంటల సాగుకు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. కరువు పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో సబ్సిడీని పెంచి శనగ విత్తనాలు అందించి ఆదుకోవాల్సిందిపోయి కుదించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25 శాతం సబ్సిడీతో ఒరిగేది శూన్యమని పలువురు విమర్శిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌ ధర కంటే క్వింటాపై రూ.2 వేలు అధికంగా వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం విత్తన కమిటీల వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాది 40 శాతం సబ్సిడీతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విత్తనాలు సరఫరా చేసింది. ఫలితంగా రైతులకు మేలు జరిగింది. అంతేకాక సకాలంలో పెట్టుబడి సాయం చేయడంతో సాగు ఇబ్బంది లేకుండా జరిగింది.

ఇక్కడిలా..

జిల్లాలో మొత్తం 20 మండలాల్లో సుమారు 34 వేల ఎకరాల్లో ఏటా శనగ సాగు చేస్తారు. ప్రస్తుతం వర్షాలు కురిసి శనగ విత్తేందుకు అనుకూల వాతావరణం నెలకొంది. దీంతో సాగుచేసే మండలాల్లో శనగ విత్తనాల కోసం రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. జిల్లాకు 14 వేల క్వింటాళ్ల విత్తనాలు కేటాయించినట్లు అధికారుల సమాచారం.

గరిష్టంగా ఎంతంటే?

రబీలో సాగు చేసే శనగ రైతులకు 25 శాతం సబ్సిడీపై మాత్రమే విత్తనాలు అందించేందుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బయట మార్కెట్‌లో క్వింటా శనగ రూ.7,000 నుంచి 7,500 ధర పలుకుతోంది. ప్రభుత్వం ఇచ్చే జేజి – 11 క్వింటా ధర రూ.9,400 కాగా అందులో 25 శాతం రాయితీ రూ.2,350 పోను రూ.7,050 రైతులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కాక్‌ – 2 రకం క్వింటా ధర రూ.12,100 ఉండగా రాయితీ రూ.3,025 పోను రూ.9,075 చెల్లించాలి. అలాగే ఒక్కో రైతుకు ఎకరాకు 40 కిలోల చొప్పున గరిష్టంగా ఐదెకరాలకు రెండు క్వింటాళ్లు పంపిణీ చేయనున్నారు. ఎకరా ఉన్న రైతుకు 40 కిలోలు, రెండెకరాలుంటే 80 కిలోల వంతున పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రైతుల కష్టాలు పట్టవా?

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుల కష్టాలు గుర్తించి 40 శాతం సబ్సిడీపై శనగ విత్తనాలు సరఫరా చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సబ్సిడీని కుదించడం సరికాదు. కరువు పరిస్థితుల్లో రైతులపై ఇలాంటి భారం మోపడం దుర్మార్గం. – మద్దసాని మాలకొండయ్య,

అగ్రహారం, కొండాపురం మండలం

25 శాతం సబ్సిడీతో ఇస్తున్నాం

ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 25 శాతం సబ్సిడీపై శనగ విత్తనాలు అందిస్తున్నాం. ఇప్పటికే ఆయా మండలాల్లో విత్తనాలు కావాల్సిన వారు రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా అవగాహన కల్పించాం. అర్హులైన ప్రతి రైతుకు 25 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తాం.

– పి.చెన్నారెడ్డి, ఏడీఏ, ఉదయగిరి

శనగ విత్తనాల రాయితీకి కూటమి ప్రభుత్వం కోత

ఏకంగా 25 శాతానికి తగ్గింపు

గతేడాది క్వింటాకు 40 శాతం

ప్రస్తుతం రూ.9,400

ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు

గత రబీలో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శనగపై 40 శాతం రాయితీ అందించింది. ధర రూ.8,100 కాగా అందులో 40 శాతం అంటే రూ.3,240 పోను రైతులు 4,680కే క్వింటా విత్తనాలు పొందారు. అదనపు భారం పడకుండా సబ్సిడీ శాతం పెంచాలని నేడు రైతులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే పంటల దిగుబడి తర్వాత గిట్టుబాటు ధరలు కూడా పెంచాలని కోరుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం శనగలకు మద్దతు ధర క్వింటాకు రూ.5,650 ప్రకటించగా కనీసం పెట్టుబడులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విత్తన సబ్సిడీకి కత్తెర 1
1/5

విత్తన సబ్సిడీకి కత్తెర

విత్తన సబ్సిడీకి కత్తెర 2
2/5

విత్తన సబ్సిడీకి కత్తెర

విత్తన సబ్సిడీకి కత్తెర 3
3/5

విత్తన సబ్సిడీకి కత్తెర

విత్తన సబ్సిడీకి కత్తెర 4
4/5

విత్తన సబ్సిడీకి కత్తెర

విత్తన సబ్సిడీకి కత్తెర 5
5/5

విత్తన సబ్సిడీకి కత్తెర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement