డీసీపల్లిలో 517 పొగాకు బేళ్ల విక్రయం | - | Sakshi
Sakshi News home page

డీసీపల్లిలో 517 పొగాకు బేళ్ల విక్రయం

Published Thu, Jun 13 2024 12:40 AM | Last Updated on Thu, Jun 13 2024 12:40 AM

డీసీపల్లిలో 517  పొగాకు బేళ్ల విక్రయం

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో బుధవారం 517 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్‌ తెలిపారు. వేలానికి 566 బేళ్లు రాగా వాటిలో 517 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 60,216 కిలోల పొగాకును విక్రయించగా రూ.1,64,55,039 వ్యాపారం జరిగింది. గరిష్టంగా కిలోకు రూ.331, కనిష్టంగా రూ.204 ధర లభించింది. సగటు ధర రూ.273.27 నమోదైంది. వేలంలో 18 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

కిలో పొగాకు గరిష్ట ధర రూ.330

కలిగిరి: కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.330 లభించింది. జనరల్‌ క్లస్టర్‌కు చెందిన రైతులు 1,011 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 816 పొగాకు బేళ్లను కొనుగోలు చేశారు. 195 బేళ్లను వివిధ కారణాలతో కొనుగోలు తిరస్కరించారు. వేలం నిర్వహణాధికారి మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ కిలో పొగాకుకు గరిష్టంగా రూ.330, కనిష్టంగా రూ.205 ధర లభించగా, సగటున రూ.283.15 ధర లభించిందన్నారు. వేలంలో 14 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.

ముమ్మరంగా పొగాకు కొనుగోళ్లు

ఒంగోలు సెంట్రల్‌: ఒంగోలు పొగాకు బోర్డు పరిధిలో కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నట్లు ఆర్‌ఎం లక్ష్మణరావు తెలిపారు. రీజియన్‌ పరిధిలో బుధవారం 9,931 బేళ్లు రాగా, 8,864 బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారని, 1,067 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించినట్లు చెప్పారు. ఒంగోలు, కొండపి కేంద్రాల్లో 79వ రోజు వేలంలో 4752 బేళ్లు రాగా, 4321 బేళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. 431 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. కేజీ గరిష్టంగా రూ.331 కాగా, కనిష్టంగా రూ.205, సగటు ధర రూ.283.34 వచ్చింది. మార్చి 6న ప్రారంభమైన డీసీపల్లి, కలిగిరి, కందుకూరు–2, ఒంగోలు–2, వెల్లంపల్లి, పొదిలి, కనిగిరి తదితర కేంద్రాల్లో 74వ రోజు వేలం పాటలు జరుగుతున్నట్లు చెప్పారు. ఆయా కేంద్రాల్లో 5179 బేళ్లు రాగా, 4543 బేళ్లు కొనుగోలయ్యాయని, 636 బేళ్లు వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. అందులో గరిష్టంగా రూ.331, కనిష్టంగా రూ.205, సరాసరి రూ.281.08 పడినట్లు చెప్పారు.

పచ్చిరొట్ట పైర్లతో

భూమి సారవంతం

పొగాకు బోర్డు ఆర్‌ఎం లక్ష్మణరావు

ఒంగోలు సెంట్రల్‌: పొగాకు రైతులు పచ్చిరొట్ట పైర్లను విరివిగా పెంచి భూసారం పెంపొందించుకోవాలని పొగాకు బోర్డు ఆర్‌ఎం లక్ష్మణరావు సూచించారు. బుధవారం ఆయన కార్యాలయంలో రైతులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆర్‌ఎం మాట్లాడుతూ పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యతను రైతులకు వివరించి ఎక్కువ మొత్తంలో సాగయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. నేల భౌతిక లక్షణాలు పెంపొందించడం, నత్రజని, ఇతర పోషకాలు లోపలి పొరలకు ప్రవేశించడం, కలుపు మొక్కలను సమూలంగా నిర్మూలించేందుకు పచ్చిరొట్ట పైర్లు ఉపయోగపడతాయని చెప్పారు. ఎకరానికి 15 నుంచి 20 కేజీల విత్తనాలు చల్లి 50 నుంచి 55 రోజుల తర్వాత అంటే పూత దశకు రాక ముందే పంటను నేలలో కలియ దున్నితే భూసారం పెరిగి తర్వాత సాగు చేసే పంటదిగుబడి పెరుగుతుందని, భూమికి నీటిని నిల్వ చేసే సామర్థ్యం పెరుగు తుందని, రసాయనిక ఎరువులు వేసే పరిమా ణం కూడా తగ్గుతుందని చెప్పారు. సేంద్రియ కర్బన శాతం కూడా పెరుగుతుందన్నారు. విరివిగా పచ్చి రొట్ట పైర్లు వేసి నాణ్యమైన పొగాకు ఉత్పిత్తి చేయాలని సూచించారు. రైతు సంఘ నాయకులు, ఐటీసీ, జీపీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు

అండగా ఉంటాం

నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

వెంకటగిరిరూరల్‌: వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వెంకటగిరిలోని ఎన్‌జేఆర్‌ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామన్నారు. అయినప్పటికీ 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే టీడీపీ ఇచ్చిన హామీలన్నీ చిత్తశుద్ధితో నెరవేర్చాలని కోరారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు బనాయించడం, కక్ష పూరిత చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement