నెల్లూరు(బృందావనం): నగరంలో శనివారం రాత్రి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని స్టోన్‌హౌస్‌పేటలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి నగరోత్సవం స్టోన్‌హౌస్‌పేటలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరింది. అమ్మవారు ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసిన వ్యాఘ్ర వాహనంపై కొలువుదీరి నవాబుపేట, శెట్టిగుంట రోడ్డు తదితర మార్గాల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.