అధికారంలోకి వస్తే మేమేంటో చూపిస్తాం | - | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వస్తే మేమేంటో చూపిస్తాం

Mar 5 2024 12:35 AM | Updated on Mar 5 2024 11:10 AM

- - Sakshi

పోలీసులపై బెదిరింపులకు దిగిన రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు సిటీ: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులకు తామేంటో చూపిస్తామంటూ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పోలీసులను బెదిరించారు. నగరంలోని రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం నారాయణ గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకులతో కలిసి ఆయన విలేక రుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణను, టీడీపీ సానుభూతిపరులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రని ఆరోపించారు. తమను ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలేది లేదన్నారు. వారి జాతకాలు బయటపెడతానని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement