జింబాబ్వే అద్భుతం.. రెండు రోజుల్లో ముగిసిన మ్యాచ్‌

Zimbabwe Stun Afghanistan Winning Test Match With In Two Days - Sakshi

దుబాయ్‌: ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టులో జింబాబ్వే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్గనిస్తాన్‌ను రెండు సార్లు ఔట్‌ చేసిన జింబాబ్వే రెండు రోజుల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కాగా చాలాకాలం తర్వాత టెస్టుల్లో జింబాబ్బే చెప్పుకోదగ్గ విజయం సాధించడం విశేషం. మొదటి రోజు ఆటలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆఫ్గన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన జింబాబ్వే తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.

రెండో రోజు ఆటలో కెప్టెన్ సీన్‌ విలియయ్స్‌ (105 పరుగులు) సెంచరీతో ఆకట్టుకోవడం.. రజా 43, చకాబ్వా 44  పరుగులతో అతనికి సహకరించారు. దీంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌట్‌ కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం ఆఫ్గన్‌.. జింబాబ్వే బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో 17 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్‌ కోల్పోకుండా చేధించిన జింబాబ్వే అద్బుత విజయాన్ని నమోదు చేసి  రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఓవరాల్‌గా రెండో రోజు ఆటలో 15 వికెట్లు నేలకూలడం విశేషం. అయితే మొటేరా వేదికగా టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన పింక్‌ బాల్‌ టెస్టు కూడా రెండు రోజుల్లోనే ముగియడం విశేషం. 
చదవండి: దుమ్మురేపిన కాన్వే.. రాహుల్‌ మాత్రం అక్కడే
'మ్యాచ్‌ను 5 రోజుల వరకు తీసుకెళ్లలేం'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top