పిచ్‌పై బంగ్లా బ్యాట్స్‌మెన్‌ డ్యాన్స్.. గొడవకు దిగిన జింబాబ్వే బౌల‌ర్‌

Zimbabwe Pacer Muzarabani And Bangladesh Batsman Taskin Ahmed Engage In Awkward Fight - Sakshi

హ‌రారే: జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్ల మ‌ధ్య హరారే వేదికగా జ‌రుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య గొడవ జ‌రిగింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మ‌న్ త‌స్కిన్ అహ్మ‌ద్ పిచ్‌పై డ్యాన్స్ వేయ‌డం ఈ గొడవ మొదలైంది. జింబాబ్వే బౌల‌ర్ బ్లెస్సింగ్ ముజ‌ర‌బానికి వేసిన బంతిని వికెట్ కీప‌ర్‌కు వ‌దిలేసిన త‌స్కిన్‌.. ఆ వెంట‌నే ఓ డ్యాన్స్ స్టెప్ వేశాడు. ఇది చూసిన ముజ‌ర‌బాని అత‌నిపైకి దూసుకెళ్లాడు. దీంతో ఇద్ద‌రు ఆటగాళ్లు ఒక‌రి ముఖంలో మ‌రొక‌రు కోపంగా చూసుకుంటూ మాటామాటా అనుకున్నారు.

అయితే, ముజ‌ర‌బాని అలా రియాక్ట్ కావ‌డానికి ఓ కార‌ణం ఉంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌.. ఓ ద‌శ‌లో 132 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే లిట‌న్ దాస్ (95), మ‌హ్మ‌దుల్లా (150), చివ‌ర్లో త‌స్కిన్ అహ్మ‌ద్ (75) అద్భుతంగా రాణించ‌డంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 468 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా 9వ వికెట్‌కు మ‌హ్మ‌దుల్లాతో క‌లిసి త‌స్కిన్ 191 ప‌రుగులు జోడించ‌డం ముజ‌ర‌బాని జీర్ణించుకోలేకపోయాడు.

దీనికి తోడు తస్కిన్‌ తనను అవమానించే విధంగా డ్యాన్స్‌ వేయడంతో ముజ‌ర‌బాని సహనాన్ని కోల్పోయాడు. ఓ దశలో ఇద్దరు ఆటగాళ్లు పిచ్‌పైనే  కొట్టుకునేలా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగుల భారీ స్కోర్‌ చేయగా, ఆతిధ్య జట్టు సైతం ధీటుగానే బదులిస్తుంది. మూడో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి జింబాబ్వే 2 వికెట్లు నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌(81), ఓపెనర్‌ మిల్టన్‌ షుంబా(41) రాణించగా, కెయిటానో(63), డియాన్‌ మయర్స్‌(21) క్రీజ్‌లో ఉన్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top