జింబాబ్వే లక్ష్యం 477

Bangladesh set a target of 477 runs for Zimbabwe - Sakshi

హరారే: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు పోరాడుతోంది. 477 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టిన జింబాబ్వే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. బ్రెండన్‌ టేలర్‌ (92; 16 ఫోర్లు) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. బంగ్లాదేశ్‌ విజయం సాధించా లంటే చివరి రోజు ఏడు వికెట్లు తీయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 45/0తో శనివారం ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ను 67.4 ఓవర్లలో 284/1 వద్ద డిక్లేర్‌ చేసింది. నజ్ముల్‌ (117 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), షాద్‌మన్‌ ఇస్లామ్‌ (115 నాటౌట్‌; 9 ఫోర్లు) శతకాలు సాధించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top