మా ఇద్దరిలో ఎవరు బాగా చేశారో చెప్పండి..

Yuzvendra Chahal Shares Dance Video With Wife Dhanashree Became Viral - Sakshi

ఢిల్లీ: టీమిండియా ఆటగాడు యజ్వేంద్ర చహల్‌ తన భార్య ధనశ్రీ వర్మతో​కలిసి డ్యాన్స్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాప్‌ సింగర్‌ మేఘన్‌ వాంద్జిక్‌ పాటకు ఇద్దరు కలిసి స్టెప్పులేశారు. ముందు ఫార్వర్డ్‌ స్టెప్‌ వేసిన ధనశ్రీ డ్యాన్స్‌ మొదలుపెట్టగా.. ఆ తర్వాత చహల్‌ ఆమెకు జతకలిశాడు. ఇద్దరు కలిసి బాడీ మూమెంట్స్‌ ఏం లేకుండా కేవలం ఫుట్‌వర్క్‌పైనే డ్యాన్స్‌ చేయడం ఆకట్టకుంది. మాములుగానే డ్యాన్స్‌తో పాటు ఎక్స్‌ప్రెషన్స్‌తో ధనశ్రీ దుమ్ములేపితే.. చహల్‌ కూడా భార్య ట్రైనింగ్‌లో బాగానే రాటుదేలినట్లుగా కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ చహల్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. మా ఇద్దరిలో ఎవరి ప్రదర్శన బాగుందే మీరే చెప్పండి అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

ఇక కివీస్‌తో జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు చహల్‌ ఎంపిక అవ్వలేదు. అయితే జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియా రెండోజట్టులో మాత్రం చహల్‌ చోటు దక్కించుకున్నాడు. శ్రీలంక గడ్డపై  చహల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు లంక గడ్డపై  ఆడిన 6 టీ20 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున పాల్గొన్న చహల్‌ మొదటి రెండు మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయాడు. అనంతరం జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీశాడు.
చదవండి: వచ్చే డబ్ల్యూటీసీలో అన్ని మ్యాచ్‌లకు సమాన పాయింట్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top