వచ్చే డబ్ల్యూటీసీలో అన్ని మ్యాచ్‌లకు సమాన పాయింట్లు | ICC World Test Championship Points System to Undergo a Change in Second Edition | Sakshi
Sakshi News home page

వచ్చే డబ్ల్యూటీసీలో అన్ని మ్యాచ్‌లకు సమాన పాయింట్లు

Jun 15 2021 4:26 AM | Updated on Jun 15 2021 4:26 AM

ICC World Test Championship Points System to Undergo a Change in Second Edition - Sakshi

దుబాయ్‌: రాబోయే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో సిరీస్‌ ప్రకారం కాకుండా ఒక్కో టెస్టు మ్యాచ్‌ విజయానికి పాయింట్లు కేటాయించాలని ఐసీసీ యోచిస్తోంది. తొలి డబ్ల్యూటీసీలో ఒక్కో సిరీస్‌కు ఐసీసీ 120 పాయింట్లు ఇచ్చింది. మూడు టెస్టుల సిరీస్‌ అయితే ఒక్కో టెస్టు విజయానికి 40 పాయింట్లే దక్కేవి. అదే రెండు టెస్టుల సిరీస్‌ అయితే ప్రతీ గెలుపునకు జట్టు ఖాతాలో 60 పాయింట్లు చేరాయి. దీనిని సరిదిద్దేందుకు సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఉన్నా... ఒక్కో టెస్టుకు విడిగా పాయింట్లు కేటాయిస్తే అన్ని జట్లకు సమాన అవకాశం ఉంటుందని ఐసీసీ భావిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement