క్వార్టర్‌ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ | Yuki Bambri pair in the quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ

Jul 25 2024 3:51 AM | Updated on Jul 25 2024 9:51 AM

Yuki Bambri pair in the quarter finals

క్రొయేషియా ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోరీ్నలో పురుషుల డబుల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉమగ్‌ నగరంలో బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–2తో కొవాలిక్‌ (స్లొవేకియా)–కారాబెల్లి (అర్జెంటీనా) జంటపై గెలిచింది. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌–అర్జున్‌ ఖడే (భారత్‌) జోడీ 2–6, 2–6తో గిడో ఆండ్రెజి (అర్జెంటీనా)–వరేలా (మెక్సికో) ద్వయం చేతిలో ఓడిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement