Hulk Hogan: అసభ్యకర ట్వీట్‌ చేసిన రెజ్లింగ్‌ స్టార్‌.. ఆపై తొలగింపు

WWE Super Star Hulk Hogan Accidentally Tweets Private Message Twitter - Sakshi

డబ్ల్యూడబ్ల్యూఈ(WWE) ఫాలో అయ్యేవారికి హల్క్‌ హోగన్‌(Hulk Hogan) గురించి పరిచయం అక్కర్లేదు. ఆల్‌టైమ్‌ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన హల్క్‌ హోగన్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలోనూ ఉన్నాడు. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హల్క్‌ హోగన్‌కు ట్విటర్‌లో ఫాలోవర్స్‌ కూడా ఎక్కువే. హల్క్‌ హోగన్‌కు ట్విటర్‌లో దాదాపు రెండు మిలియన్‌కి పైగా ఫాలోవర్స్‌ ఉండడం విశేషం.

అలాంటి హల్క్‌ హోగన్‌కు ట్విటర్‌లో వింత అనుభవం ఎదురైంది. పొరపాటుగా చేసిన ఒక అసభ్యకరమైన ట్వీట్‌కు వినూత్న రీతిలో కామెంట్లు రావడం హల్క్‌ హోగన్‌ను చిక్కుల్లో పడేసింది. అయితే తప్పును గుర్తించి వెంటనే ట్వీట్‌ను తొలగించినప్పటికి స్క్రీన్‌షాట్ల రూపంలో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. తన బ్రదర్‌కు చెప్పాల్సిన ప్రైవేటు మెసేజ్‌ను పొరపాటున ట్విటర్‌లో పెట్టేశాడు. ''టాయిలెట్‌ పేపర్స్‌ అయిపోయాయి.. ఎలా తుడుచుకోవాలి.. కాస్త సహాయం చెయ్యు బ్రదర్‌'' అంటూ ట్వీట్‌ చేశాడు.

హల్క్‌ హాగన్‌ ఏంటి పిచ్చి ట్వీట్‌ ఏదో పెట్టాడని అభిమానులు అనుకునేలోపే తప్పును గుర్తించి దానిని తొలగించాడు. తన బ్రదర్‌తో మాట్లాడాల్సిన మాటలు పొరపాటున ఫోన్‌ రికార్డర్‌లో రికార్డయి ట్విటర్‌లో కాప్షన్‌గా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో హల్క్‌ హోగన్‌కు ఇబ్బంది తప్పలేదు. అయితే హల్క్‌ హోగన్‌ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదులెండి. ఇంతకముందు కూడా చాలాసార్లు అతను తప్పుడు ట్వీట్స్‌తో ఇబ్బందులు కొనితెచ్చుకున్నాడు.  

డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజాల్లో ఒకడిగా గుర్తింపు పొందిన హల్క్‌ హోగన్‌ 1977 నుంచి 2012 వరకు రెజ్లింగ్‌లో స్టార్‌గా కొనసాగాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌తో పాటు టీఎన్‌ఏలోనూ తన హవా కొనసాగించిన హల్క్‌ హోగన్‌ పలుమార్లు చాంపియన్‌షిప్‌లు కైవసం చేసుకున్నాడు. 1980లలో టాప్‌స్టార్‌గా వెలుగొందిన హల్క్‌ హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లో కొన్నేళ్ల పాటు నెంబర్‌వన్‌ స్థానంలో కొనసాగాడు.

చదవండి: టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది'

'త్వరలో షోలే-2 రాబోతుంది.. సిద్ధంగా ఉండండి'

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top