breaking news
Hulk Hogan
-
ఏడు పదుల వయసులోనూ కండల వీరుడిగా.. హాల్క్ హోగన్ అరుదైన చిత్రాలు
-
WWF దిగ్గజం హల్క్ హోగన్ కన్నుమూత
దిగ్గజ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ) సూపర్ స్టార్ హల్క్ హోగన్ (Hulk Hogan) (71) ఇవాళ (జులై 24) ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గల తన నివాసంలో హోగన్ తుది శ్వాస విడిచారని సమాచారం. కార్డియాక్ అరెస్ట్ కారణంగా హోగన్ మృతి చెందినట్లు తెలుస్తుంది.1953 ఆగస్ట్ 11న జన్మించిన హోగన్ అసలు పేరు టెర్రి జీనీ బోల్లియా. 80వ దశకంలో హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (WWF) ద్వారా విశేష ప్రజాదరణ పొందారు. హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజిల్ మానియాలోని తొలి తొమ్మిది ఎడిషన్లలో ఎనిమిది టైటిళ్లు సాధించాడు.హోగన్‌కు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్లలో కూడా చోటు దక్కింది. 1984లో హోగన్ తన తొలి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. హోగన్ తన కెరీర్ ఉన్నతిలో ఆండ్రీ ద జెయింట్, మాఛో మ్యాన్ రాండీ సావేజ్, అల్టిమేట్ వారియర్ లాంటి దిగ్గజ రెజర్లతో కుస్తీ పడ్డాడు. హోగన్‌కు అతని మీసాలు చాలా ప్రత్యేకతనిచ్చాయి.హోగన్ రెజ్లింగ్ కాకుండా సినిమాలు, టీవీ రియాలిటీ షోల్లో కూడా నటించాడు. హోగన్ గడిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేశాడు. హోగన్‌కు భారత్‌లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. 80వ దశకంలో పిల్లలకు హోగన్ సుపరిచితుడు. -
69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా..
Meet Hulk Hogan's fiancé!: డబ్ల్యుడబ్ల్యుఈ లెజెండ్ హల్క్ హోగన్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. 69 ఏళ్ల వయసులో తన చిరకాల ప్రేయసి స్కై డైలీని వివాహమాడనున్నాడు. అంతకంటే ముందు తామిద్దరం ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు హల్క్ హోగన్ వెల్లడించాడు. కాగా 45 ఏళ్ల స్కై డైలీ అకౌంటెంట్‌గా పనిచేస్తూనే.. యోగా ఇన్‌స్ట్రక్టర్‌గానూ బిజీగా ఉంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా అమెరికాలోని జార్జియాలో సాధారణ కుటుంబంలో జన్మించిన టెర్రీ జీనీ బొలియా డబ్ల్యుడబ్ల్యుఈ స్టార్‌గా ఎదిగాడు. తన రింగ్నేమ్ హల్క్ హోగన్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ముచ్చటగా మూడోసారి హల్క్ హోగన్ 1983లో లిండా క్లారిడ్జ్ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో అభిప్రాయభేదాలు రావడంతో 2009లో విడాకులిచ్చాడు. ఆ మరుసటి ఏడాదే జెన్నిఫర్ మెక్డేనియల్తో వివాహ బంధంలో అడుగుపెట్టాడు. పదకొండేళ్లలోనే వీరి బంధం కూడా ముగిసిపోయింది. 2021లో జెన్నిఫర్‌కి విడాకులిచ్చిన హల్క్ హోగన్ గతేడాది నుంచి స్కై డైలీతో రిలేషన్ కొనసాగిస్తున్నాడు. అయితే, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అతడు తాజాగా.. తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపాడు. ఆమె పిల్లలతోనూ ప్రేమలో పడ్డాను స్కై డైలీ పిల్లలతో కూడా తాను ప్రేమలో పడిపోయానని, వారిని తండ్రిలా చూసుకుంటానని పేర్కొన్నాడు. కాగా గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హల్క్ హోగన్‌కు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరిద్దరు నటులే! ఇక ప్రొఫెషనల్ రెజ్లర్‌గా రిటైర్ అయిన హల్క్ హోగన్ సైతం నటుడిగా కొనసాగుతున్నాడు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అతడికి ఇన్‌స్టాలో దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో స్కై డైలీతో దిగిన ఫొటోలు షేర్ చేయగా.. కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేశారు. నా జీవితం.. నా ఇష్టం ఇందుకు బదులిచ్చిన అతడు.. ‘‘నేను చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాను. నా ఎంగేజ్మెంట్ గురించి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. నా స్కై బేబీ.. నా జీవితం నా ఇష్టం’’ అని బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో అవును.. నిజమే కదా అంటూ అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. ఏదేమైనా హల్క్- స్కై ఎంగేజ్మెంట్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఆల్‌టైమ్ డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన హల్క్ హోగన్ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. చదవండి: 'హర్మన్‌ప్రీత్ ప్రవర్తన మరీ ఓవర్‌గా అనిపించింది' -
Hulk Hogan: అసభ్యకర ట్వీట్ చేసిన రెజ్లింగ్ స్టార్.. ఆపై తొలగింపు
డబ్ల్యూడబ్ల్యూఈ(WWE) ఫాలో అయ్యేవారికి హల్క్ హోగన్(Hulk Hogan) గురించి పరిచయం అక్కర్లేదు. ఆల్‌టైమ్ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన హల్క్ హోగన్ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోనూ ఉన్నాడు. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హల్క్ హోగన్‌కు ట్విటర్లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే. హల్క్ హోగన్‌కు ట్విటర్లో దాదాపు రెండు మిలియన్‌కి పైగా ఫాలోవర్స్ ఉండడం విశేషం. అలాంటి హల్క్ హోగన్‌కు ట్విటర్లో వింత అనుభవం ఎదురైంది. పొరపాటుగా చేసిన ఒక అసభ్యకరమైన ట్వీట్‌కు వినూత్న రీతిలో కామెంట్లు రావడం హల్క్ హోగన్‌ను చిక్కుల్లో పడేసింది. అయితే తప్పును గుర్తించి వెంటనే ట్వీట్‌ను తొలగించినప్పటికి స్క్రీన్షాట్ల రూపంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తన బ్రదర్‌కు చెప్పాల్సిన ప్రైవేటు మెసేజ్‌ను పొరపాటున ట్విటర్లో పెట్టేశాడు. ''టాయిలెట్ పేపర్స్ అయిపోయాయి.. ఎలా తుడుచుకోవాలి.. కాస్త సహాయం చెయ్యు బ్రదర్'' అంటూ ట్వీట్ చేశాడు. హల్క్ హాగన్ ఏంటి పిచ్చి ట్వీట్ ఏదో పెట్టాడని అభిమానులు అనుకునేలోపే తప్పును గుర్తించి దానిని తొలగించాడు. తన బ్రదర్‌తో మాట్లాడాల్సిన మాటలు పొరపాటున ఫోన్ రికార్డర్లో రికార్డయి ట్విటర్లో కాప్షన్‌గా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో హల్క్ హోగన్‌కు ఇబ్బంది తప్పలేదు. అయితే హల్క్ హోగన్ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదులెండి. ఇంతకముందు కూడా చాలాసార్లు అతను తప్పుడు ట్వీట్స్‌తో ఇబ్బందులు కొనితెచ్చుకున్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజాల్లో ఒకడిగా గుర్తింపు పొందిన హల్క్ హోగన్ 1977 నుంచి 2012 వరకు రెజ్లింగ్‌లో స్టార్‌గా కొనసాగాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్తో పాటు టీఎన్ఏలోనూ తన హవా కొనసాగించిన హల్క్ హోగన్ పలుమార్లు చాంపియన్‌షిప్‌లు కైవసం చేసుకున్నాడు. 1980లలో టాప్‌స్టార్‌గా వెలుగొందిన హల్క్ హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లో కొన్నేళ్ల పాటు నెంబర్‌వన్ స్థానంలో కొనసాగాడు. చదవండి: టాప్‌లెస్‌గా దర్శనం.. 'అలా చూడకు ఏదో అవుతుంది' 'త్వరలో షోలే-2 రాబోతుంది.. సిద్ధంగా ఉండండి' Goodnight HULKAMANIACS and jabronie marks without a life that don’t know it a work when you work a work and work yourself into a shit, marks pic.twitter.com/9GHA5cbn3g — David Bixenspan (@davidbix) January 25, 2023 what in the world pic.twitter.com/qvD76IqG9s — David Bixenspan (@davidbix) January 25, 2023 -
ఫ్రెండ్ భార్యతో సెక్స్.. వీడియో లీక్..
న్యూయార్క్: స్నేహితుడి భార్యతో ఏకాంతంగా గడిపిన వీడియో టేపుల వ్యవహారంలో ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ కు భారీ పరిహారం దక్కింది. ఆయనకు 11.5 కోట్ల డాలర్లు చెల్లించాలని గాకర్ మీడియాను అమెరికాలోని ఫ్లోరిడా కోర్టు ఆదేశించింది. వాదోపవాదనలు ప్రారంభమైన ఆరు గంటల్లోపే న్యాయస్థానం ఈ ఆదేశాలు వెలువరించింది. కోర్టు తీర్పుపై అప్పీలు చేస్తామని గాకర్ మీడియా వ్యవస్థాపకుడు నిక్ డెంటన్ ప్రకటించారు. తన మాజీ బెస్ట్ ఫ్రెండ్ భార్యతో హల్క్ హోగన్ ఏకాంతంగా గడిపిన సెక్స్ వీడియోను 2012లో గాకర్ వెబ్ సైట్ పోస్టు చేసింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోను బహిర్గతం చేయడంతో వృతి జీవితానికి నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ గాకర్ మీడియాపై ఆయన పరువునష్టం దావా వేశారు. తనకు జరిగిన నష్టానికి 100 మిలియన్ డాలర్లు పరిహారంగా ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు. రహస్యంగా వీడియో చిత్రీకరించి, ఇంటర్నెట్ లో పోస్టు చేశారని కోర్టుకు హోగన్ తరపు న్యాయవాది తెలిపారు. గాకర్ మీడియా జర్నలిజం ప్రమాణాలను పాటించలేదని పేర్కొన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను బహిర్గం చేసే హక్కు మీడియాకు లేదని వాదించారు. ఈ వీడియోను ఇంటర్నెట్ లో పెట్టే ముందు హోగన్ ను కాని, అతడితో సన్నిహితంగా గడిపిన మహిళను సంప్రదించలేదన్నారు. ఈ వీడియోను చిత్రీకరించిన మహిళ భర్తను సంప్రదించిందని వెల్లడించారు. వాదోపవాదనలు విన్న కోర్టు.. హోగన్ కు 11.5 కోట్ల డాలర్లు చెల్లించాలని గాకర్ మీడియాను ఆదేశించింది. కోర్టు తీర్పుపై హోగన్ హర్షం వ్యక్తం చేశారు.