ఫ్రెండ్ భార్యతో సెక్స్.. వీడియో లీక్.. | Hulk Hogan wins $115 million in Gawker sex-tape case | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్ భార్యతో సెక్స్.. వీడియో లీక్..

Mar 22 2016 10:32 AM | Updated on Sep 3 2017 8:20 PM

ఫ్రెండ్ భార్యతో సెక్స్.. వీడియో లీక్..

ఫ్రెండ్ భార్యతో సెక్స్.. వీడియో లీక్..

స్నేహితుడి భార్యతో ఏకాంతంగా గడిపిన వీడియో టేపుల వ్యవహారంలో ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ కు భారీ పరిహారం దక్కింది.

న్యూయార్క్: స్నేహితుడి భార్యతో ఏకాంతంగా గడిపిన వీడియో టేపుల వ్యవహారంలో ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ కు భారీ పరిహారం దక్కింది. ఆయనకు 11.5 కోట్ల డాలర్లు చెల్లించాలని గాకర్ మీడియాను అమెరికాలోని ఫ్లోరిడా కోర్టు ఆదేశించింది. వాదోపవాదనలు ప్రారంభమైన ఆరు గంటల్లోపే న్యాయస్థానం ఈ ఆదేశాలు వెలువరించింది. కోర్టు తీర్పుపై అప్పీలు చేస్తామని గాకర్ మీడియా వ్యవస్థాపకుడు నిక్ డెంటన్ ప్రకటించారు.

తన మాజీ బెస్ట్ ఫ్రెండ్ భార్యతో హల్క్ హోగన్ ఏకాంతంగా గడిపిన సెక్స్ వీడియోను 2012లో గాకర్ వెబ్ సైట్ పోస్టు చేసింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోను బహిర్గతం చేయడంతో వృతి జీవితానికి నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ గాకర్ మీడియాపై ఆయన పరువునష్టం దావా వేశారు. తనకు జరిగిన నష్టానికి 100 మిలియన్ డాలర్లు పరిహారంగా ఇప్పించాలని కోర్టును ఆశ్రయించారు.

రహస్యంగా వీడియో చిత్రీకరించి, ఇంటర్నెట్ లో పోస్టు చేశారని కోర్టుకు హోగన్ తరపు న్యాయవాది తెలిపారు. గాకర్ మీడియా జర్నలిజం ప్రమాణాలను పాటించలేదని పేర్కొన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను బహిర్గం చేసే హక్కు  మీడియాకు లేదని వాదించారు. ఈ వీడియోను ఇంటర్నెట్ లో పెట్టే ముందు హోగన్ ను కాని, అతడితో సన్నిహితంగా గడిపిన మహిళను సంప్రదించలేదన్నారు. ఈ వీడియోను చిత్రీకరించిన మహిళ భర్తను సంప్రదించిందని వెల్లడించారు. వాదోపవాదనలు విన్న కోర్టు.. హోగన్ కు 11.5 కోట్ల డాలర్లు చెల్లించాలని గాకర్ మీడియాను ఆదేశించింది. కోర్టు తీర్పుపై హోగన్ హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement