Sakshi News home page

బ్రిజ్‌భూషణ్‌ ఎంగిలి మెతుకులు తినే బతుకు తనది: వినేశ్‌ ఫొగాట్‌ ఘాటు విమర్శలు

Published Sat, Jun 24 2023 9:30 PM

Wrestlers Protest: Vinesh phogat Slams Yogeshwar Dutt - Sakshi

న్యూఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత యోగేశ్వర్‌ దత్‌ ఆరుగురు స్టార్‌ రెజ్లర్లకు ట్రయల్స్‌లో ఇచ్చిన మినహాయింపును తప్పుబట్టాడు. ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌ల కోసం నిర్వహించే సెలక్షన్‌ ట్రయల్స్‌లో వినేశ్, సంగీత, సాక్షి మలిక్, సత్యవర్త్, బజరంగ్, జితేందర్‌లకు కేవలం ఒక్క బౌట్‌ పోటీ పెట్టారు.

భారత ఒలింపిక్‌ సంఘం అడ్‌హక్‌ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం అనుచితమని బీజేపీ నేత కూడా అయిన యోగేశ్వర్‌ దత్‌ అన్నాడు. ‘దేని ఆధారంగా ఇలాంటి మినహాయింపు నిర్ణయం తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. కమిటీ నిర్ణయం ఏమాత్రం సరికాదు. నా సలహా ఏంటంటే జూనియర్‌ రెజ్లర్లంతా నిరసన చేపట్టో, ప్రధానికి లేఖ రాసో దీనిపై పోరాడాలి’ అని యోగేశ్వర్‌ ట్వీట్‌ చేశాడు. రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ లైంగిక వేధింపులపై నియమించిన కమిటీలో యోగేశ్వర్‌ సభ్యుడిగా ఉన్నాడు.  

బ్రిజ్‌భూషణ్‌ కీలుబొమ్మ దత్‌.. 
తమ విన్నపాన్ని మన్నించి అడ్‌హక్‌ కమిటీ ఇచ్చిన మినహాయింపును తప్పుబట్టిన యోగేశ్వర్‌ దత్‌పై స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అతనో వెన్నెముక లేని మనిషని, బ్రిజ్‌భూషణ్‌ చేతిలో కీలుబొమ్మని విమర్శించింది. ‘బ్రిజ్‌భూషణ్‌ ఎంగిలి మెతుకులు తినే బతుకు యోగేశ్వర్‌ది.

అతని అడుగులకు మడుగులొత్తే తొత్తు యోగేశ్వర్‌. ఇతని చరిత్ర రెజ్లింగ్‌ లోకానికి బాగా తెలుసు’ అని ట్విట్టర్‌లో వినేశ్‌ మండిపడింది. విచారణ కమిటీలో ఉంటూ ఎవరెవరు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా మాట్లాడారో వారి పేర్లను అతనికి చేరవేశాడని దుయ్యబట్టింది. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్టేట్‌మెంట్‌ ఇచి్చన రెజ్లర్లతో రాజీకొచ్చేలా ప్రవర్తించాడని ఆరోపించింది.

గ్యాంజస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ గెలుపు 
దుబాయ్‌: గ్లోబల్‌ చెస్‌ లీగ్‌లో గ్యాంజస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ జట్టు రెండో విజయం నమోదు చేసింది. అల్పైన్‌ వారియర్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గ్యాంజస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ జట్టు 11–6తో గెలిచింది. ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (అల్పైన్‌ వారియర్స్‌)తో జరిగిన గేమ్‌లో గ్యాంజస్‌ జట్టు ప్లేయర్, భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌తో 44 ఎత్తుల్లో ఓడిపోయినా... రాపోర్ట్, బెలా గ్యాంజస్‌ జట్టు తరఫున నెగ్గడంతో ఆ జట్టుకు విజయం దక్కింది.

ఇతర మ్యాచ్‌ల్లో బాలన్‌ అలస్‌కాన్‌ నైట్స్‌ 14–5తో అప్‌గ్రాడ్‌ ముంబా మాస్టర్స్‌ జట్టుపై, త్రివేని కాంటినెంటల్‌ కింగ్స్‌ 8–7తో చింగారి గల్ఫ్‌ టైటాన్స్‌పై, అల్పైన్‌ వారియర్స్‌ 9–7తో బాలన్‌ అలస్‌కాన్‌ నైట్స్‌పై గెలిచాయి.   

క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ జోడీ ఓటమి 
సించ్‌ టెన్నిస్‌ చాంపియన్‌íÙప్‌ ఏటీపీ–500 టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీ కథ ముగిసింది. లండన్‌లో జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 3–6, 6–7 (5/7)తో వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌)–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. బోపన్న జోడీకి 18,190 యూరోల (రూ. 16 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

ప్రణయ్‌ పరాజయం  
భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తైపీ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి ని్రష్కమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ ప్రణయ్‌ 19–21, 8–21తో ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయాడు.     

చదవండి: KP Chowdary Case: మా బిడ్డకు కేపీ చౌదరితో అసలు పరిచయమే లేదు.. వారం రోజులు ఇల్లు కావాలంటే: సిక్కిరెడ్డి తల్లి 

Advertisement

What’s your opinion

Advertisement