WPL-2025: డబ్ల్యూపీఎల్‌ విజేతగా ముంబై ఇండియన్స్ | WPL-2025: Mumbai Indians win over Delhi Capitals | Sakshi
Sakshi News home page

WPL-2025: డబ్ల్యూపీఎల్‌ విజేతగా ముంబై ఇండియన్స్

Mar 15 2025 11:48 PM | Updated on Mar 16 2025 12:03 AM

WPL-2025: Mumbai Indians win over Delhi Capitals

డబ్ల్యూపీఎల్‌-2025లో భాగంగా ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీపై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం 150 పరుగుల లక్ష్య చేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ వెనుక పడింది. 

నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై ఇండియన్స్‌ జట్టు ఈ సీజన్‌కి విజేతగా నిలిచింది. ఈ విజయంతో రెండోసారి ముంబై జట్టు టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. ముంబై బ్యాటర్లలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) టాప్‌ స్కోరర్‌గా నిలిచారు.

తుది జట్లు
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): యాస్తికా భాటియా(వికెట్ కీప‌ర్‌), హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), సజీవన్ సజన, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీప‌ర్‌), నికి ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి

Advertisement
 
Advertisement
Advertisement