అత‌డెందుకు దండగ అన్నారు.. క‌ట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే సూప‌ర్ సెంచ‌రీ | Will Young slams his 4th century in ODIs | Sakshi
Sakshi News home page

PAK vs NZ: అత‌డెందుకు దండగ అన్నారు.. క‌ట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే సూప‌ర్ సెంచ‌రీ

Feb 19 2025 5:34 PM | Updated on Feb 19 2025 5:56 PM

Will Young slams his 4th century in ODIs

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో మొద‌టి సెంచ‌రీ న‌మోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా కరాచీ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెన‌ర్ విల్ యంగ్ (Will Young) అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. కాన్వే, విలియ‌మ్స‌న్‌, మిచెల్ వంటి స్టార్‌ ఆట‌గాళ్లు విఫ‌ల‌మైన చోట‌.. యంగ్ త‌న సూప‌ర్ సెంచ‌రీతో జ‌ట్టును ఆదుకున్నాడు. 107 బంతుల్లో యంగ్ త‌న సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

విల్ యంగ్‌కు ఇది నాలుగో వన్డే సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. ఓవరాల్‌గా 112 బంతులు ఎదుర్కొన్న యంగ్‌.. 12 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 107 పరుగులు చేసి  ఔటయ్యాడు.

జీరో టూ హీరో..
కాగా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు పాక్ వేదిక‌గా జ‌రిగిన ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్‌లో యంగ్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఈ సిరీస్‌లో యంగ్‌ మూడు మ్యాచ్‌లు ఆడి కేవ‌లం 28 ప‌రుగులు మాత్రమే చేశాడు.

దీంతో అత‌డిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అత‌డిని ఎందుకు ఎంపిక చేశారని ప‌లువ‌రు మాజీ క్రికెట‌ర్లు పెద‌వి విరిచారు. కానీ యంగ్ త‌నపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు సూప‌ర్ సెంచ‌రీతో స‌మాధాన‌మిచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతో మెరిసిన యంగ్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో సెంచ‌రీ చేసిన నాలుగో న్యూజిలాండ్ ఆట‌గాడిగా నిలిచాడు. 38 ఓవ‌ర్లు ముగిసే స‌రికి న్యూజిలాండ్ 4 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. క్రీజులో లాథ‌మ్‌(57), ఫిలిప్స్‌(1) ఉన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచ‌రీలు చేసిన కివీస్ ప్లేయ‌ర్లు వీరే..
145* - నాథన్ ఆస్టిల్ vs అమెరికా, ది ఓవల్, 2004
102* - క్రిస్ కెయిర్న్స్ vsభార‌త‌, నైరోబి, 2000 ఫైనల్
100 - కేన్ విలియమ్సన్ vs ఆస్ట్రేలియా, ఎడ్జ్‌బాస్టన్, 2017
100* - విల్ యంగ్ vs పాకిస్తాన్‌, కరాచీ, 2025

ఛాంపియ‌న్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌కు పాక్, కివీస్ తుది జ‌ట్లే ఇవే..
పాకిస్తాన్‌
ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), సల్మాన్‌ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్‌ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

న్యూజిలాండ్‌
డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్‌ కీపర్‌), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ
చదవండి: శెభాష్‌ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ పోస్ట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement