
వెస్టిండీస్ వుమెన్ ప్లేయర్ డియాండ్రా డాటిన్ తన వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరును సాధించింది. సౌతాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. అలా తన కెరీర్ బెస్ట్ నమోదు చేసిన డియాండ్రాకు మ్యాచ్‌లో చేదు అనుభవమే ఎదురైంది. అయితే ఆమె సెంచరీ చేసిన మ్యాచ్‌లో జట్టు ఓడిపోయిందనుకుంటే పొరపాటే.. వరుణుడి రూపంలో మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం రాలేదు.
చదవండి: U19 World Cup 2022: మ్యాచ్ జరుగుతుండగా భూకంపం..
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ జట్టు 46వ ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అందులో సగానికి పైగా స్కోరు డియాండ్రాదే. 159 బంతుల్లో 18 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 150 పరుగుల కెరీర్ బెస్ట్‌ను నమోదు చేసింది. అంతకముందు పాకిస్తాన్‌పై 132 పరుగులు ఆమెకు వన్డేల్లో అత్యధిక స్కోరుగా ఉండేది. అయితే వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 46 ఓవర్‌లో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో దక్షిణాఫ్రికా లక్ష్యం 29 ఓవర్లలో 204 పరుగుల టార్గెట్‌ను విధించారు.
అయితే 18 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తోంది. ఈ దశలో మరోసారి వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. అయితే వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు పిచ్‌ను పరిశీలించి ఆట సాధ్యం కాదని తేల్చి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలా వర్షం రూపంలో డియాండ్రాను దురదృష్టం వెంటాడింది. తాను భారీ స్కోరు చేసిన మ్యాచ్ ఇలా వర్షార్పణం అవడం ఊహించలేదని.. చాలా బాధగా ఉందని డియాండ్రా ఇంటర్య్వూలో పేర్కొంది.
చదవండి: మోర్నీ మోర్కెల్ వేగవంతమైన బంతి.. దిల్షాన్ భయపడ్డాడు