వారెవ్వా క‌మ్మిన్స్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే అద్బుత‌మైన క్యాచ్‌! వీడియో | WI vs AUS: Pat Cummins takes a one-handed stunner off his own bowling | Sakshi
Sakshi News home page

AUS vs WI: వారెవ్వా క‌మ్మిన్స్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే అద్బుత‌మైన క్యాచ్‌! వీడియో

Jul 5 2025 10:48 AM | Updated on Jul 5 2025 11:05 AM

WI vs AUS: Pat Cummins takes a one-handed stunner off his own bowling

గ్రెన‌డా వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ సంచ‌ల‌న క్యాచ్‌తో మెరిశాడు. విండీస్ ఆట‌గాడు కీస్ కార్టీని సింగిల్ హ్యాండ్ క్యాచ్‌తో క‌మ్మిన్స్ పెవిలియ‌న్‌కు పంపాడు. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్ 9 వ ఓవ‌ర్ వేసిన క‌మ్మిన్స్‌.. రెండో బంతిని కార్టీగా గుడ్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు.

ఆ బంతిని కార్టీ ఆఫ్‌సైడ్ డిఫెన్స్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్‌తీసుకుని లెగ్‌సైడ్ షార్ట్ స్క్వేర్ మిడ్ వికెట్ దిశ‌గా వెళ్లింది. ఈ క్ర‌మంలో ఫాలో త్రూలో క‌మ్మిన్స్ త‌న కుడివైప‌న‌కు ప‌రిగెత్తుకుంటూ వెళ్లి సింగిల్ హ్యాండ్ క్యాచ్‌ను అందుకున్నాడు.

ఇది చూసిన విండీస్ బ్యాట‌ర్ బిత్త‌ర‌పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యుత్త‌మ క్యాచ్‌ల‌లో ఒక‌టిగా నిలిచిపోతుంద‌ని కొనియాడుతున్నారు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆసీస్ త‌మ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల న‌ష్టానికి 12 ప‌రుగులు చేసింది.

కంగారులు ప్ర‌స్తుతం 45 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. అంత‌కుముందు విండీస్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 253 ప‌రుగుల‌కు ఆలౌటైంది. వెస్టిండీస్ బ్యాట‌ర్ల‌లో కింగ్‌(75), జాన్ క్యాంప్‌బెల్‌(40) ప‌రుగుల‌తో రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో లియోన్ మూడు, హాజిల్‌వుడ్‌, క‌మ్మిన్స్ త‌లా రెండు వికెట్లు సాధించారు. ఇక ఆస్ట్రేలియా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 286 ప‌రుగులు చేసింది.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement