T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌-2021లో అత్యధిక వికెట్ల వీరులు వీరే!

Who is the highest wicket taker T20 World Cup 2021 - Sakshi

Who Has Taken Most Wickets in T20 World Cup 2021?: యూఏఈ వేదికగా జరుగుతన్న టీ20 ప్రపంచకప్‌-2021 తుది దశకు చేరుకుంది. సోమవారం(నవంబర్‌8) భారత్‌-నమీబియా మ్యాచ్‌తో లీగ్‌ దశ ముగిసింది. దీంతో సెమిఫైనల్స్‌కు గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, గ్రూపు-2 నుంచి పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ ఆర్హత సాధించాయి. నవంబర్‌ 10 న తొలి సెమిపైనల్లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌లు తలపడనున్నాయి.

రెండో సెమీపైనల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. ఇక టీ20 ఫార్మాట్‌ అంటే సాదారణంగా  ఫోర్లు, సిక్స్‌లుతో బ్యాటర్లు  చేలరేగడం చూస్తూ ఉంటాం. కానీ ఈ సారి భిన్నంగా బౌలర్ల హవా కొనసాగింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు ఒకే ఒక్క సారి స్కోర్‌బోర్డ్‌ 200 ధాటింది. అదికూడా టీమిండియా.. ఆఫ్గానిస్తాన్‌పై నమోదు చేసింది. ఈ ప్రపంచకప్‌లో అన్ని జట్ట బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లపై ఓలుక్కేద్దాం.. 

 టీ20 ప్రపంచకప్‌-2021లో ఇప్పటివరకు అత్యధిక వికెట్ల వీరులు వీరే..

1. వనిందు హసరంగా:  8 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి  శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగా మొదటి స్ధానంలో ఉన్నాడు. దీంట్లో ఒక  హ్యాట్రిక్ కూడా ఉంది. 

2. ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా)- 5 ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు; సగటు- 9.90

3. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్‌)- 5 ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు; సగటు- 10.45

4.షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్‌)- 6 ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు; సగటు- 11.18

5.డ్వైన్ ప్రిటోరియస్ (దక్షిణాఫ్రికా)- 5 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు; సగటు- 11.22

6.అన్రిచ్ నార్ట్జే (దక్షిణాఫ్రికా)- 5 ఇన్నింగ్స్‌లలో 9 వికెట్లు; సగటు- 11.55

7.జోష్ డేవీ (స్కాట్లాండ్‌)-5 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు; సగటు- 13.66

8.ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)- 5 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు; సగటు- 13.37

9.జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)- 5 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు; సగటు- 13.75

10.రషీద్ ఖాన్ (ఆఫ్గానిస్తాన్‌)- 5 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు; సగటు- 14.00

చదవండి: T20 WC 2021: ఎలిమినేటెడ్‌ బెస్ట్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌.. కెప్టెన్‌ మాత్రం లేడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top