source: X
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లను గమనించిన వారికి ఓ చిన్న పరికరం ప్రత్యేకంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తో పాటు పలువురు భారత క్రికెటర్లు తమ కంప్రెషన్ వెస్ట్ వెనుక భాగంలో ఈ చిన్న డివైజ్‌ను ధరించి కనిపించారు.
ఇది చూడటానికి సాధారణ హెల్త్ ట్రాకర్‌లా కనిపించినప్పటికీ.. దీని వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ డివైజ్ ఆటగాళ్ల శారీరక శ్రమ, కదలికలు, వేగం, వర్క్‌లోడ్ వంటి అంశాలను కొలిచే ట్రాకింగ్ డివైజ్ అని తెలుస్తోంది. ఆధునిక క్రికెట్‌లో స్పోర్ట్స్ సైన్స్, డేటా అనాలిసిస్‌కు ప్రాధాన్యం పెరగడంతో ఇలాంటి టెక్నాలజీలను వాడుతున్నారు.
పైన పేర్కొన్న పరికరాన్ని STATSports వంటి సంస్థలు తయారు చేస్తాయి. ఈ పరికరం GPS, మోషన్ సెన్సర్ల సాయంతో ఆటగాడు మైదానంలో ఎంత దూరం పరుగెత్తాడు, ఎంత వేగంతో కదిలాడు, ఎన్ని సార్లు వేగం పెంచాడు, ఎంత వేగంగా ఆగాడు వంటి అనేక వివరాలను రికార్డ్ చేస్తుంది. అలాగే హృదయ స్పందనకు సంబంధించిన డేటాను కూడా ట్రాక్ చేస్తుంది.
భారత క్రికెటర్లు ఈ తరహా పరికరాలను 2019 నుంచే వాడుతున్నారు. ఈ పరికరం గాయాల నివారణలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. ఓ ఆటగాడిపై ఎక్కువ వర్క్‌లోడ్ పడుతోందని డేటా ద్వారా గుర్తిస్తే.. అతడి ట్రైనింగ్ తీవ్రతను తగ్గించడం లేదా రికవరీ సమయాన్ని పెంచడం ద్వారా గాయాల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ఇదీ చదవండి: మరో క్రికెట్ పండుగ.. షెడ్యూల్ విడుదల


