T20 WC 2022: రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్లు.. అయినా అర్హత సాధించలేకపోయారు

West Indies And Sri Lanka Did Not Qualify For T20 World Cup 2022 Super 12 - Sakshi

West Indies And Sri Lanka Did Not Qualify For T20 World Cup 2022 Super 12: పొట్టి ఫార్మాట్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన వెస్టిండీస్‌.. ఓసారి జగజ్జేతగా, మరో రెండుసార్లు రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక జట్లు వచ్చే ఏడాది ఆసీస్‌ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశకు అర్హత సాధించలేకపోయాయి. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన శ్రీలంక, విండీస్ జట్లు సూపర్-12కు అర్హత కోల్పోయాయి. నవంబర్‌ 15 లోపు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో ఉన్న జట్లు మాత్రమే వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించనున్నాయి. 

ప్రస్తుతం విండీస్‌, శ్రీలంక జట్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 9, 10 స్థానాల్లో ఉన్నాయి. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు సూపర్-12లో ప్రవేశించాలంటే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ ఏడాది సూపర్-12 ఆడిన 12 జట్లలో 8 జట్లు(ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అప్గానిస్థాన్, బంగ్లాదేశ్) నేరుగా 2022 టీ20 ప్రపంచకప్ సూపర్-12కు అర్హత సాధించాయి. ప్రస్తుత ప్రపంచకప్‌ సూపర్-12లో బంగ్లాదేశ్ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడినప్పటికీ సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను మట్టికరిపించడంతో 8వ ర్యాంక్‌కు చేరుకుంది. ఫలితంగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ సూపర్-12కు నేరుగా అర్హత సాధించింది.
చదవండి: ఐపీఎలే ముఖ్యమనుకున్న వాళ్లు దేశం కోసం ఏం ఆడతారు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top